వెన్ను నొప్పి బాధపెడుతున్నా నటి అట్ల తద్ది
భారతీయ సంస్కృతిలో అట్ల తద్ది (అట్ల తదియ)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది స్త్రీలకు ముఖ్యమైన పండుగ.
By: Tupaki Desk | 21 Oct 2024 4:40 AM GMTభారతీయ సంస్కృతిలో అట్ల తద్ది (అట్ల తదియ)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది స్త్రీలకు ముఖ్యమైన పండుగ. అట్ల తద్ది పూజలో భాగంగా చంద్రుడిని ఆరాధిస్తారు. చంద్రునిలో ఉండే శక్తి, అనుగ్రహం వల్ల తాము సౌభాగ్యంగా ఉంటామని, తమ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరిస్తాయని శాస్త్రాలలో ఉంది. ఇలా చేయడం వల్ల కుజ దోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఎందుకంటే నవ గ్రహాలలో అంగారకుడు(కుజుడి)కి అట్లంటే ఎంతో ఇష్టమట. అందుకే తనకు వీటిని నైవేద్యంగా పెడితే కుజ దోషం తొలగిపోయి, తాము చేసే పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయని స్త్రీలకు మేలు జరుగుతుందని నమ్మకం.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానితో కలిసి తన మొదటి కర్వా చౌత్ (అట్ల తద్ది) జరుపుకుంది. శాస్త్ర నియమాలను పాటించింది. భర్తతో తన అన్యోన్యతను చాటుకుంది. వెన్ను గాయంతో బాధపడుతున్నా రకుల్ ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల నుండి రకుల్ భర్తతో రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. ఈ జంట పండుగ రోజు రెడ్ ఎత్నిక్ వేర్‌లో నైన్‌ల వరకు ధరించారు. రకుల్ ఎరుపు - బంగారు రంగు డిజైనర్ దుస్తులను ధరించింది. పూల ప్రింట్లు ఉన్న ఎరుపు రంగు కుర్తాను ఎంచుకున్న భగ్నాని ట్రెడిషనల్ గా కనిపించారు. మొదటి ఫోటోలో ఈ జంట కెమెరాలకు పోజులిస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ కనిపించారు. రెండవ ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ జల్లెడ ద్వారా భగ్నాని చూస్తున్నట్లు కనిపించింది. థాలీకి సంబంధించిన ఫోటోలను కూడా రకుల్ ప్రీత్ పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఈ జంట ఎంతో అందంగా ఆరాధనతో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించగా, కొందరు అభిమానులు సింగ్ నడుము చుట్టూ ఉన్న బెల్ట్‌ను కూడా గమనించారు. ఈ పోస్ట్‌పై ఓ అభిమాని స్పందిస్తూ ``ఆ బెల్ట్ ఏంటి? అది వెన్ను నొప్పి బెల్ట్`` అని నేను అనుకుంటున్నాను అని రాసారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ వివాహం చేసుకున్నారు. 2021లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రకుల్ ప్రీత్ చివరిగా కమల్ హాసన్ `ఇండియన్ 2`లో .. శివ కార్తికేయన్‌తో `అయలాన్`లో కూడా కనిపించింది.