ఇలా బ్రేకప్ చెప్పడం అన్యాయం రకుల్!
ప్రేమికుల మధ్య...భార్య భర్తల మధ్య దూరం ఎప్పుడు పెరుగతుంది? ఏ కారణాలుగా విడిపోతారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 13 Sep 2024 1:30 PM GMTప్రేమికుల మధ్య...భార్య భర్తల మధ్య దూరం ఎప్పుడు పెరుగతుంది? ఏ కారణాలుగా విడిపోతారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. అలా విడిపోయారు అంటే ఎన్నో బలమైన కారణాలుంటాయి. మనసుకు తగిలిని వ్యక్తిగత గాయాలుంటాయి. అవి మనస్పర్దలు కావొచ్చు..ఇంకేవైనా కావొచ్చు. కానీ వేయించిన ఆహారం తీసుకొచ్చాడు? అని బ్రేకప్ చెప్పిన వారిని ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు చూడండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది.
ఇటీవలే జాకీ భగన్నాని పెళ్లి చేసుకుంది. అప్పుడే బ్రేకప్ చెప్పుకున్నారా? ఏంటి అని కంగారు పడకండి. రకుల్ జాకీక కంటే మరొకరి ముందుగానే మనసు ఇచ్చిందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని రకుల్ చెబుతూనే ఆ బ్రేకప్ స్టోరీ కూడా రివీల్ చేసింది. `జాకీ నా జీవితంలో కి రాకముందు నాకు సంబంధాల విలువ తెలియదు. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఇద్దరం కలసి ఓ రెస్టారెంట్ కి వెళ్లాం.
అతడు నా కోసం వేయించిన ఆహారం తీసుకొచ్చాడు. అది నాకు నచ్చలేదు. దీంతో వెంటనే అతడికి బ్రేకప్ చెప్పాను. ఆహారం విషయంలో నాకంటూ కొన్ని కండీషన్లు ఉన్నాయి. వాటిని సంతృప్తి పరచలేని వ్యక్తి నా జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేస్తాడు అనే అభద్రతా భావంతో అతడికి దూరమయ్యాను. ఆరోగం కోసం ఏడాది పాటే శాఖహార భోజనమే మానేసాను` అని తెలిపింది.
అయితే తొలి ప్రియుడికి రకుల్ ఇలా సరైన కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం సరిగ్గా లేదంటూ నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే ప్రేమించిన వాడి విషయంలో ప్రియురా ళ్లు క్షమించి వదిలేస్తున్నారు. అలాంటింది వేయించిన ఆహారం తెచ్చాడని బ్రేకప్ చెప్పడం సరైన చర్య కాదంటూ..ఈ విషయంలో తప్పు అంతా నీదే అంటూ రకుల్ మీదనే నెట్టేస్తున్నారు. అయినా ఇదంతా గతమనుకోండి.