దాన్ని పట్టించుకోక పోవడం పెద్ద తప్పు : రకుల్
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ టాప్ స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంది టాప్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.
By: Tupaki Desk | 2 Dec 2024 6:30 PM GMTటాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ టాప్ స్టార్ హీరోయిన్‌గా ఎంతో మంది టాప్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా టాలీవుడ్‌లో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువ సమయంలోనే కనిపించకుండా పోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్ప పెద్దగా ఎక్కడ ఈ అమ్మడు కనిపించక పోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. తిరిగి ఈమె పూర్వ వైభవం సొంతం చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక ప్రమాదం ఆమెను కొన్ని నెలల పాటు బెడ్ కే పరిమితం చేసిన విషయం తెల్సిందే.
కొన్ని వారాల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ప్రమాదంకు గురి అయ్యింది. ఏకంగా 80 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసిందట. ఆ సమయంలో వెన్నులో నొప్పి వచ్చింది. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్‌కు వెళ్లడంతో పాటు, ఇతర పనులు చేసిందట. కానీ ఆ సమయంలో ఆమె తనకు తీవ్రమైన ప్రమాదం జరిగిందని గుర్తించలేదట. ఆ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిమ్‌లో ప్రమాదం జరిగిన తర్వాత నేను దాన్ని పట్టించుకోకుండా షూటింగ్‌కు వెళ్లడం అతి పెద్ద తప్పు. ఆ సమయంలోనే నేను చికిత్స తీసుకుని ఉంటే ఈ స్థాయిలో తనకు ఇబ్బంది ఉండేది కాదు అంటూ చెప్పుకొచ్చింది.
జిమ్‌లో 80 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసిన సమయంలో జరిగిన ప్రమాదంతో తనకు ఏమీ కాలేదని భావించి షూటింగ్ వెళ్లాను. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత కనీసం నా దుస్తులను మార్చుకోలేనంత నొప్పి వచ్చింది. మెల్ల మెల్లగా తన నడుము కింద భాగం స్పర్శ లేకుండా పోయింది. ఒకానొక సమయంలో నా నడుము కింది భాగం పూర్తిగా మొద్దుబారి పోయినట్లు అయింది. అంతే కాకుండా నాకు బీపీ పూర్తిగా పడిపోయి కళ్లు తిరిగి పడిపోయాను. అప్పుడు తనను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది. ఆ సమయంలో నొప్పిని లైట్ తీసుకుని పెద్ద తప్పు చేశాను అంది.
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరగా మెగా హీరో మూవీ కొండ పొలంలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు రాలేదు. కానీ లక్కీగా బాలీవుడ్‌లో 2022లో అరడజను సినిమాలు చేసే అవకాశం దక్కింది. కానీ ఆ సినిమాలు ఏవీ సక్సెస్ కాలేదు, దాంతో హిందీలో సినిమాలు చేసే అవకాశాలు కూడా తగ్గాయి. మొత్తానికి ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మాత్రమే ఫాలోయింగ్ కొనసాగుతోంది. సినిమాల్లో ఈమె ఫాలోయింగ్ పూర్తిగా తగ్గింది. అయితే ఈ అమ్మడి అందం ఇంకా యంగ్ హీరోలకు జోడీగా నటించే స్థాయిలో ఉందని, త్వరలోనే పూర్వ వైభవం సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.