Begin typing your search above and press return to search.

ఆ హిట్‌ ప్రాంచైజీ మూవీలో రకుల్‌ ఉందా? లేదా?

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో నటించిన 'మేరే హస్బెండ్‌ కీ బివి' సినిమా ఇటీవల విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

By:  Tupaki Desk   |   1 March 2025 11:30 AM GMT
ఆ హిట్‌ ప్రాంచైజీ మూవీలో రకుల్‌ ఉందా? లేదా?
X

రకుల్‌ ప్రీత్ సింగ్‌ కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా, టాప్ స్టార్‌గా వరుస సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒకానొక సమయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్‌కి సైతం డేట్ల లేక నో చెప్పిందని టాక్‌. ఇప్పుడు ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాలను సైతం చేయలేక పోతుంది. తెలుగులో ఈ అమ్మడి సినిమా వచ్చి చాలా కాలం అయింది. తెలుగులో ఈమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అడపా దడపా బాలీవుడ్‌లోనే ఈమె కనిపిస్తుంది. తాజాగా అక్కడ కూడా తీవ్ర నిరాశ ఈమెకు మిగిలింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో నటించిన 'మేరే హస్బెండ్‌ కీ బివి' సినిమా ఇటీవల విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి రోజు కనీసం రూ.2 కోట్ల వసూళ్లు నమోదు చేయలేక పోయింది. లాంగ్‌ రన్‌లో సినిమా రూ.10 కోట్లు కూడా రాబట్టలేక పోయిందని సమాచారం. సినిమాలో రకుల్‌కి మంచి పాత్రే దక్కినా ఫలితం తారు మారు కావడంతో బాలీవుడ్‌లో మరోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఈమె చేతిలో దే దే ప్యార్‌ దే 2 మాత్రమే ఉంది. దే దే ప్యార్‌ దే సినిమా గతంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ లోనూ ఆమెను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

మేరే హస్బెండ్‌ కీ బివి సినిమా విడుదలకు ముందు 'రేస్‌' ప్రాంచైజీలో రాబోతున్న నాల్గవ మూవీలో ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారనే వార్తలు వచ్చాయి. సైఫ్‌ అలీ ఖాన్‌ రేస్‌ 4లో నటించబోతున్నారని, ఆ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ తాజా సినిమా ఫలితం నేపథ్యంలో రకుల్‌ చేతిలో ఆ ప్రాజెక్ట్‌ ఉందా... చేయి జారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మద్య కాలంలో రకుల్‌ టైం అస్సలు బాగాలేదు. కనుక రేస్‌ సినిమాలో అయినా నటించే అవకాశం ఉంటుందో లేదో అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి తర్వాత మరింతగా ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకటి రెండు సంవత్సరాల్లో రకుల్‌ పూర్తిగా కనుమరుగు అయినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ యొక్క అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట ఎంత వైరల్‌ అయినా ఆమె నటిస్తున్న సినిమాలు ఆడకపోవడంతో ఆఫర్లు దక్కడం లేదు. వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు కూడా చేయి జారుతున్నట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితి నుంచి రకుల్‌ బయట పడేనా అనేది చూడాలి.