Begin typing your search above and press return to search.

హీరోయిన్ ని బలి చేసిన హిట్ సెంటిమెంట్..!

రకుల్ చెప్పిన సినిమా ఏదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్. దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ ప్లేస్ లో ముందు రకుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 11:30 AM GMT
హీరోయిన్ ని బలి చేసిన హిట్ సెంటిమెంట్..!
X

తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించి ఆ క్రేజ్ ని ఎంతోకాలం నిలుపుకోలేక పోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన విషయాల గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక స్టార్ హీరో సినిమాలో తనను కొద్దిరోజులు షూట్ చేసి ఆ తర్వాత మళ్లీ ఆ సినిమా నుంచి తప్పించారని చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ చెప్పిన సినిమా ఏదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్. దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ ప్లేస్ లో ముందు రకుల్ ప్రీత్ సింగ్ ని సెలెక్ట్ చేశారు.

రకుల్ తో కొద్దిరోజులు షూట్ కూడా జరిగిందట. ఐతే దర్శక నిర్మాతలు ఎందుకో ఈ పాత్రకు రకుల్ సూట్ అవ్వట్లేదని ఆమెను తీసి ఆ ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నారు. ఆల్రెడీ ప్రభాస్, కాజల్ అప్పటికే డార్లింగ్ తో హిట్ కొట్టారు కాబట్టి ఆ హిట్ సెంటిమెంట్ వల్లే ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఐతే మిస్టర్ పర్ఫెక్ట్ రిజల్ట్ చూస్తే కాజల్ ఎంపిక నిజంగానే సినిమాకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు.

ఐతే తన షెడ్యూల్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లిన తనకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తీరా చూస్తే ఆ సినిమాలో హీరోయిన్ మారిపోయిందని.. ఆ టైం లో తను చాలా బాధపడ్డానని రకుల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇప్పటివరకు తన సొంత ప్రతిభతోనే అవకాశాలు అందుకున్నానని.. అందుకే ప్రేక్షకులు తనని ఇప్పటికీ ఆదరిస్తున్నారని అన్నారు.

సౌత్ లో దాదాపు కెరీర్ గ్రాఫ్ పడిపోయిన రకుల్ బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా ఛాన్సులు అందుకుంటుంది. అమ్మడు ప్రస్తుతం దే దే ప్యార్ దే 2 లో నటిస్తుంది. బాలీవుడ్ లో రకుల్ గ్లామర్ రోల్స్ చేస్తూ అక్కడ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఐతే బాలీవుడ్ తో పోల్చితే టాలీవుడ్ లో రకుల్ గ్లామర్ ని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. తెలుగులో మళ్లీ తిరిగి ఛాన్స్ వస్తే మరో మాట మాట్లాడకుండా చేయాలని చూస్తుంది రకుల్ మరి ఆ అవకాశం ఎవరు ఇస్తారన్నది చూడాలి. సౌత్ లో ఎలాగు ఛాన్సులు లేవని అవకాశాలు వస్తున్న బాలీవుడ్ వైపే ఎక్కువ ఫోకస్ పెట్టింది రకుల్.