బ్యూటీ ఐకాన్ రకుల్.. ఊహించని గ్లామర్ డోస్
తెల్లని డ్రెస్సులో నోవెల్ స్టైల్‌లో ఉన్న రకుల్ ఈ ఫోటోతో తన గ్లామర్‌కు కొత్త మాయాజాలం జోడించింది.
By: Tupaki Desk | 11 Nov 2024 4:37 PM GMTరకుల్ ప్రీత్ సింగ్ సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో తన గ్లామర్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈమధ్య తెలుగులో కంటే అమ్మడు బాలీవుడ్ లోనే బిజీ అవుతోంది. ఇక తాజాగా 'మసాలా!' మ్యాగజైన్ కవర్ ఫోటోలో అందంగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది. తెల్లని డ్రెస్సులో నోవెల్ స్టైల్‌లో ఉన్న రకుల్ ఈ ఫోటోతో తన గ్లామర్‌కు కొత్త మాయాజాలం జోడించింది.
"ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి విజయం స్వయం సమృద్ధి" అంటూ రకుల్ తన ప్రయాణంలో పొందిన అనుభవాలను పంచుకుంది. ఈ ఫోటోకి లక్షల్లో లైకులు వస్తుండగా, ఆమె అభిమానులు ఈ కొత్త లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రకుల్ కెరీర్ వివరాల్లోకి వెళితే, ఆమె మొన్నటి వరకు టాలీవుడ్‌లోనే బిజీగా నటించింది. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా తొలిసారిగా బిగ్ హిట్‌ను అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి టాప్ హీరోలతో జోడీ కట్టిన రకుల్, అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించింది. తెలుగులోనే కాకుండా, ఆమె తమిళ పరిశ్రమలోనూ తన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్, అక్కడ తన ప్రతిభను నిరూపించుకుని మంచి అవకాశాలు పొందింది.
ప్రస్తుతానికి హిందీలో ప్రముఖ హీరోలతో కలిసి నటిస్తూ బిజీగా ఉంది. జాకీ భగ్నానితో రిలేషన్‌లో ఉన్న రకుల్ ఇటీవల పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ ఏడాది 'ఇండియన్ 2' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఆ సినిమా భారీ విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ, ఆమె ప్రస్తుతం 'దే దే ప్యార్ దే 2' వంటి హిందీ సినిమాల్లో నటిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 23.7 మిలియన్ ఫాలోవర్స్‌తో రకుల్ రెగ్యులర్‌గా తన గ్లామర్ ఫోటోషూట్‌లు, జీవితంలోని ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా షేర్ చేసిన ఈ మసాలా కవర్ ఫోటో కూడా రకుల్ ప్రీత్ సింగ్‌లోని మరొక కొత్త కోణాన్ని ప్రదర్శిస్తోంది.