Begin typing your search above and press return to search.

ర‌కుల్ ప్రీత్ సింగ్ కి బీపీ డౌన్..ఒళ్లంతా చెమ‌ట‌లు!

ర‌కుల్ ప్రీత్ సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురైందా? బీపీ డౌన్ అవ్వ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైందా?

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:01 AM GMT
ర‌కుల్ ప్రీత్ సింగ్ కి బీపీ డౌన్..ఒళ్లంతా చెమ‌ట‌లు!
X

ర‌కుల్ ప్రీత్ సింగ్ తీవ్ర అనారోగ్యానికి గురైందా? బీపీ డౌన్ అవ్వ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైందా? అంటే అవునే విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. ఇటీవ‌ల ర‌కుల్ ప్రీత్ సింగ్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. వర్కౌట్ సెషన్‌లో 80 కిలోల డెడ్‌లిఫ్ట్ ను ఎత్త‌డంతో వీపుకు గాయమైంది. పాక్షికంగా వెన్న‌పూస పై ఆ బ‌రువు ప్ర‌భావం చూపించింది. న‌డుముకు ఎలాంటి సేప్టీ బెల్డ్ ధ‌రించ‌కుండా చేయ‌డంతోనే ఈ ప‌రిస్థితి త‌లెత్తింది.

దీంతో వారానికి పైగా బెడ్ రెస్ట్ లోనే ఉంది. డాక్ట‌ర్లు బెడ్ రెస్ట్ సూచించ‌డంతో క్ర‌మంగా కోలుకుంది. నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో ర‌కుల్ `దేదే ప‌ర్యార్ దే2` షూటింగ్ కి య‌ధావిధిగా హాజ‌రైందిట‌. చిన్న‌పాటి నొప్పిని భ‌రిస్తూనే షూట్ కి హాజ‌రైంద‌ని తెలుస్తోంది. అయితే నొప్పి రోజు రోజుకి ఎక్కువ అవ్వ‌డం తో ఫిజియో థెర‌పీ మొద‌లు పెట్టింది. అయినా నొప్పి త‌గ్గ‌లేదు. ప్రతీ మూడు ..నాలుగు గంట‌ల‌కు ఒక‌సారి మ‌ళ్లీ నొప్పి వ‌చ్చేదిట‌.

ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 10 ర‌కుల్ ప్రీత్ సింగ్ బ‌ర్త్ కావ‌డంతో సెల‌బ్రేష‌న్ల‌కు రెడీ అయింది. ఇది ఆమె కెరీర్ లో ఓ బ్యాడ్ సెల‌బ్రేష‌న్ లో మిగిలిపోయింది. పుట్టినరోజు పార్టీకి ఒక గంట ముందు వీపు గాయం కార‌ణంగా చాలా ఇబ్బంది ప‌డిందిట‌. గాయం కారణంగా ర‌కుల్ L4, L5, S1 నరాలు జామ్‌ అయ్యాయట‌. బీపీ డౌన్ అవ్వ‌డంతో ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్ట‌డంతో ఆమెని మంచం మీద ప‌డుకోబెట్టి ప్రాధ‌మిక చికిత్స అందించా రుట‌.

అనంత‌రం డాక్ట‌ర్ల‌ను పిలిపించి కండరాల సడలింపులకు అవ‌స‌ర‌మైన‌ ఇంజెక్షన్లు ఇవ్వడంతో య‌ధాస్థితికి చేరుకుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంద‌ని స‌మాచారం. అంటే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఇప్ప‌టికీ ఐదు రోజులు గ‌డుస్తుంది. కానీ ఈ విష‌యం ఇంత వ‌ర‌కూ వెలుగులో రాలేదు. ఒంట్లో న‌ల‌త‌గా ఉన్నా? రోజూ చిన్న పాటి వ్యాయామాలైన చేయ‌నిదే ర‌కుల్ డే గ‌డ‌వ‌ద‌ని స‌న్ని హితులు చెబుతున్నారు. అలా చేయ‌డం కూడా అనారోగ్యానికి దారి తీస్తుందని ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి రుజువైంది.