పూరీ డేట్స్ అడిగితే కుదరదని చెప్పా
రకుల్ తెలుగులో చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి.
By: Tupaki Desk | 28 March 2025 8:28 AMవెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. అయితే రకుల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ సినిమాతో కాదు. కన్నడ మూవీ గిల్లీతో వెండితెర అరంగేట్రం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చేసింది.
రకుల్ తెలుగులో చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. వరుసపెట్టి తెలుగులోని అగ్ర హీరోలందరితో జోడీ కట్టి సినిమాలు చేసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూసేంతగా రకుల్ బిజీ అయిపోయింది.
ప్రస్తుతం పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత కూడా కెరీర్లో రాణిస్తోంది రకుల్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తాను మోడలింగ్ లో ఉన్నప్పుడు సౌత్ ఇండస్ట్రీ గురించి తనకు పెద్దగా తెలియదని, అందుకే తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పింది.
మోడలింగ్ చేస్తున్న టైమ్ లో తన ఫోటోలు చూసి శాండిల్‌వుడ్ నుంచి రకుల్ కు మొదటి ఛాన్స్ వచ్చింది. అయితే అప్పటికి రకుల్ కు అసలు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదట. సౌత్ లో సినిమాలు కూడా చూడలేదట. అందుకే ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు ఎంతో ఆలోచించానని, ఆఖరికి తన తండ్రికి కాల్ చేసి అడగటంతో గిల్లీ మూవీలో యాక్ట్ చేసినట్టు రకుల్ చెప్పుకొచ్చింది.
ఫస్ట్ మూవీతోనే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగిందని, చదువుకుంటూనే యాక్టింగ్ కూడా చేయాలని డిసైడయ్యానని చెప్పిన రకుల్ కు గిల్లీ రిలీజయ్యాక పూరీ నుంచి ఫోన్ వచ్చిందట. ఓ సినిమా కోసం పూరీ 70 రోజులు డేట్స్ అడిగితే దానికి తాను కుదరదని కాలేజ్ ఉందని, కావాలంటే నాలుగు రోజులు ఇస్తానన్నట్టు చెప్పిందట రకుల్. తన ఇబ్బందిని పూరీ కూడా అర్థం చేసుకున్నారని, పూరీ సినిమా మాత్రమే కాకుండా ఆ టైమ్ లో మరెన్నో సినిమాలను రకుల్ వదులుకున్నట్టు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
లైఫ్ లో ప్రతీ ఒక్కరికీ బ్రేకప్స్ ఉంటాయన్న రకుల్, వాటి నుంచి తానెంతో నేర్చుకున్నట్టు తెలిపింది. ఎవరినైనా నమ్మి విడిపోతే దానంత భయంకరమైన విషయం మరోటి ఉండదని, ప్రేమ చాలా గొప్పదని, లైఫ్ లో ఏదైనా లోటు ఉంటే అది వేరే వాళ్లు పూర్తి చేస్తారని ఎప్పుడూ అనుకోకూడదని, ఎవరి లైఫ్ కు సంబంధించింది వాళ్లే చేసుకోవాలని తన భర్త జాకీ భగ్నానీని కలిసినప్పుడు మొదట దాని గురించే మాట్లాడానని, తమ ఆలోచనలు, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నామని రకుల్ తెలిపింది.