Begin typing your search above and press return to search.

రకుల్ హై వోల్టేజ్ గ్లామర్ డోస్.. బెడ్డుపై అలా..

రకుల్‌ప్రీత్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో తన నటనతో మెప్పించి, వరుస విజయాలతో ఒకప్పుడు నెంబర్ వన్ రేసులో కొనసాగింది

By:  Tupaki Desk   |   27 March 2025 3:56 PM
రకుల్ హై వోల్టేజ్ గ్లామర్ డోస్.. బెడ్డుపై అలా..
X

రకుల్‌ప్రీత్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో తన నటనతో మెప్పించి, వరుస విజయాలతో ఒకప్పుడు నెంబర్ వన్ రేసులో కొనసాగింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగులో స్టార్‌డమ్ అందుకున్న రకుల్, బాలీవుడ్‌లోనూ పలు క్రేజీ సినిమాలు చేసింది. కానీ ఈ మద్య అమ్మడికి సౌత్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. నటనతో పాటు మోడ్రన్ ట్రెండీ లుక్స్, ఫిట్‌నెస్, స్టయిలింగ్‌లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ లుక్స్‌తో అలరిస్తుంటుంది.

ఇప్పుడు తాజాగా రకుల్‌ప్రీత్ మరోసారి తన స్టన్నింగ్ గ్లామర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. వర్సేస్ కలెక్షన్‌లో ఉన్న పింక్ బాడీకాన్ డ్రెస్‌లో బెడ్‌పై ముద్దుగా, ట్రెండీగా పోజులిచ్చారు. ఈ డ్రెస్ లో ఆమె అందం మరింత హైలైట్ అయింది. డ్రెస్‌లో గ్లామర్ పర్ఫెక్ట్‌గా ఉండేలా డిజైన్ చేయడం, షోల్డర్‌ పై డబ్బుల బకుల్స్ లుక్ ఓ డిఫరెంట్ టచ్ ఇచ్చింది. దానికి మ్యాచ్ అయ్యేలా హెయిర్ స్టయిల్, మేకప్ సింపుల్ గానే ఉండి కూడా స్టైలిష్‌దనాన్ని ఎక్కువగా చూపించింది.

ఈ ఫోటోల్లో రకుల్ బెడ్‌పై లూస్‌గా రిలాక్స్‌ అవుతూ సరదాగా నవ్వుతూ, ఎక్స్‌ప్రెషన్లతో ప్యూర్ ఫన్ వైబ్ ఇస్తోంది. నవ్వుతో కూడిన క్యాప్షన్ పెట్టిన ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనను పంచుకుంది. ఈ లుక్‌లో ఆమె ధరించిన జ్యూవెలరీ, రింగ్స్, ఫుట్‌వేర్ అన్నీ వర్సేస్ స్టైల్‌కు తగ్గట్టు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. స్టైలింగ్‌ను అంషికా నిర్వహించగా, ఫోటోలు బ్యూటిఫుల్‌గా క్లిక్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రకుల్ స్మైల్, స్టయిలిష్ పోజులు చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో హార్ట్ ఎమోజీలతో, “క్యూటీ!”, “గ్లామ్ గర్ల్!” అంటూ ఫ్లడ్ చేస్తున్నారు. సినిమాల్లోకి కాకుండా ఫ్యాషన్‌లో కూడా రకుల్ తనదైన ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఆమె ఏదైనా లుక్‌ను కాన్ఫిడెన్స్‌తో మోస్తూ, అందులోనూ ఓ ప్రత్యేకమైన ఫీల్ ఇవ్వగలుగుతోంది. ప్రస్తుతం రకుల్ కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్‌లో ఉంచగా, బాలీవుడ్‌లో ఓ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో ఉన్నారు.