Begin typing your search above and press return to search.

బికినీలో ర‌కుల్.. భ‌గ్నానీ గుండె భ‌గ‌భ‌గ‌

ప‌ర్ఫెక్ట్ బికినీ బాడీతో ర‌కుల్ ప్రీత్ మంట‌లు పుట్టిస్తోంది. ప్రస్తుతం తన భర్త జాకీ భగ్నానీ, ఇత‌ర‌ కుటుంబ స‌భ్యుల‌తో కలిసి మాల్దీవులలో విహారయాత్రను ఆస్వాధిస్తోంది.

By:  Tupaki Desk   |   9 March 2025 5:00 PM IST
బికినీలో ర‌కుల్.. భ‌గ్నానీ గుండె భ‌గ‌భ‌గ‌
X

ప‌ర్ఫెక్ట్ బికినీ బాడీతో ర‌కుల్ ప్రీత్ మంట‌లు పుట్టిస్తోంది. ప్రస్తుతం తన భర్త జాకీ భగ్నానీ, ఇత‌ర‌ కుటుంబ స‌భ్యుల‌తో కలిసి మాల్దీవులలో విహారయాత్రను ఆస్వాధిస్తోంది. ఇటీవల రకుల్ తన పర్యటన నుంచి అందమైన దృశ్యాలను ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు, వీడియోలు అభిమానులను విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి.

ర‌కుల్ ఈ విహార యాత్ర‌లో పూర్తి స్వేచ్ఛ‌ను ఆస్వాధిస్తోంది. జాకీతో క‌లిసి ఈ బ్యూటీ పూల్‌సైడ్ రొమాంటిగ్గా పోజులిచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యాస్తమయం.. షైనీ గోల్డ్ కిర‌ణాలు ఈ ఫోటోను మరింత రొమాంటిక్‌గా మలిచాయి. ఈ వెకేషన్‌లో దంపతులు ఒంటరిగా సెలబ్రేట్ చేయ‌లేదు.. కుటుంబ సభ్యులు కూడా వారితో పాటు క‌నిపించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి.

ఈ వెకేష‌న్ ఆద్యంతం ర‌కుల్ సోలో బికినీ ఫోటోలతో పాటు, భ‌ర్త‌తో క‌లిసి ఉన్న‌వి, కుటుంబ స‌భ్యుల‌తో స‌న్నిహితంగా మెలిగే ఫోటోలు వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ ఫోటోలు వీక్షించాక జాకీతో ర‌కుల్ అనుబంధం, కెమిస్ట్రీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ నటించిన చివ‌రి చిత్రాలేవీ ఆశించిన విజయం సాధించ‌లేదు. క‌మ‌ల్ హాస‌న్ తో `భార‌తీయుడు 2` ఫ్లాపైంది. ఆ త‌ర్వాత అర్జున్ క‌పూర్ తో `మేరే హ‌జ్బెండ్ కి బివి` కూడా డిజాస్ట‌రైంది. త‌దుప‌రి దేదే ప్యార్ దే 2 పై ఈ భామ ఫోక‌స్ చేసింది. అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 2025లో విడుద‌ల‌వుతుంది.