Begin typing your search above and press return to search.

ఆ పెయిన్ ర‌కుల్ కి మ‌రికొన్ని నెల‌లు త‌ప్ప‌దు!

ర‌కుల్ ప్రీత్ సింగ్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో జిమ్లో వ‌ర్కౌట్ చేస్తుండ‌గా బ్యాలెన్స్ త‌ప్ప‌డంతో వెన్నుపూస‌కు గాయ‌మైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 March 2025 5:30 PM
Rakul Preet Singh Injured
X

ర‌కుల్ ప్రీత్ సింగ్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో జిమ్లో వ‌ర్కౌట్ చేస్తుండ‌గా బ్యాలెన్స్ త‌ప్ప‌డంతో వెన్నుపూస‌కు గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. 80 కిలోల బ‌రువును డెడ్ లిప్ట్ చేసే స‌మ‌యంలో? గాయ‌ప‌డింది. అయినా ఆ నొప్పిని ప‌ట్టించుకోకుండా మొండిగా వ్యాయామం కొన‌సాగించింది. దీంతో ఆ గాయం తీవ్ర‌మైంది. ప్ర‌తిగా శ‌స్త్ర చికిత్స వ‌ర‌కూ వెళ్లాల్సి వ‌చ్చింది. వారం రోజులు బెడ్ రెస్ట్...కోలుకోవ‌డానికి నెల‌లు స‌మ‌యం ప‌డుతుందని డాక్ట‌ర్లు చెప్పారు.

ఇదే విష‌యాన్ని అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెలిపింది. దీంతో ర‌కుల్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్టులు కూడా పెట్టారు. తాజాగా ఈ గాయం కొత్త అప్ డేట్ అందించింది. మునుప‌టి కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నాన‌ని తెలిపింది. కానీ గాయం నుంచి మాత్రం పూర్తిగా ఇంకా కోలుకోలేద‌ని..అందుకు మ‌రింత స‌మ‌యంప‌డుతుంద‌ని తెలిపంది.

శ‌రీరం ఇచ్చే సంకేతాలు ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తే త‌న‌లాగే బాధ‌ప‌డాల్సి ఉంటుంద‌ని..ఎవ‌రూ అలాంటి ప‌నులు ఎప్పుడు చేయోద్ద‌ని సూచించింది. ల‌క్కీగా ర‌కుల్ చేతిలో సినిమాలు లేవు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే దర్శ‌క‌, నిర్మాత‌లు చాలా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చేది. `ఇండియాన్ 3` లో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. అలాగే బాలీవుడ్ లో `దే దే ప్యార్ దే 2`లోనూ న‌టిస్తోంది.

ఈ సినిమా సెట్స్ లో ఉంది. ర‌కుల్ అవ‌స‌రం లేక‌పోవ‌డంతో యూనిట్ కూల్ గా షూటింగ్ చేసుకుంటుంది. డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లైతే మాత్రం ర‌కుల్ స్టూడియోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంట్లో మాత్రం కొత్త స్క్రిప్టులు వింటోంది. స్క్రిప్ట్ లు ఒకే చేసినా గాయం నుంచి పూర్తిగా కోలుకునే వ‌ర‌కూ అవి ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేదు.