మెడలో శిలువ పెండెంట్‌తో రకుల్ ట్విస్ట్
తాజాగా రకుల్ ధరించిన డఫెల్ బ్లేజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసేందుకు ఎంతో లూజ్ గా ఉన్న బ్లేజర్. ఇందులో రకుల్ తన అందాలను ఆరబోసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 15 Dec 2024 11:47 AM GMTరకుల్ ప్రీత్ సింగ్ నేటి తరం ఫ్యాషనిస్టాల్లో ట్రెండీ ఐకన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు నటవారసురాళ్లు గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచంలోకి దూసుకొస్తుంటే, తనదైన ప్రత్యేకతను నిలుపుకుని పోటీబరిలో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఇటీవల జాకీ భగ్నానీని పెళ్లాడిన తర్వాత రకుల్ స్పీడ్ ఎందుకనో తగ్గిపోయింది. తెలుగులో ఆఫర్లు లేవు. తమిళంలోను నటించడం లేదు. భారతీయుడు 2 ఫ్లాపయ్యాక సౌత్ లో పెద్దగా సంతకాలు చేసిందేమీ లేదు. తదుపరి ఇండియన్ 3లో అలాగే, దేదే ప్యార్ దే 2లోను నటించనుందని కథనాలొస్తున్నాయి. ఈ సినిమాలు మినహా సౌత్ లో అగ్ర హీరోల నుంచి ఆఫర్లు ఏవీ లేవ్. అటు బాలీవుడ్ లోను అజయ్ దేవగన్ తో సినిమా మినహా ఇంకేదీ సంతకం చేసినట్టు ఆధారాల్లేవ్. ఓవరాల్ గా రకుల్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఖాళీ అయిపోయిందని కూడా విశ్లేషిస్తున్నారు.
మరోవైపు రకుల్ ప్రీత్ ఇన్ స్టా వేదికగా వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులను యంగేజ్ చేస్తోంది. తాజాగా రకుల్ ధరించిన డఫెల్ బ్లేజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూసేందుకు ఎంతో లూజ్ గా ఉన్న బ్లేజర్. ఇందులో రకుల్ తన అందాలను ఆరబోసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. రకుల్ మెడలో శిలువ (జీసస్) పెండెంట్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఎంపిక చేసుకున్న బ్లేజర్ కి తగ్గట్టే మెడలో సిల్వర్ జువెలరీ మ్యాచ్ అయింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. అయితే మెడలో పెండెంట్ చూశాక.. శిలువ వేసిన మెలీనా! అంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మెలీనా బెల్లూసీలా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోందని కూడా కొందరు పొగిడేస్తున్నారు.
మరోవైపు రచయిత్రి, దర్శకురాలు మేఘనా గుల్జార్ పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ ప్రత్యేకంగా విషెస్ తెలియజేసింది. ``సంతోషకరమైన సంవత్సరం`` అంటూ గుల్జార్ కి శుభాకాంక్షలు తెలపడానికి కారణం తదుపరి పాపులర్ మహిళా డైరెక్టర్ తో రకుల్ పని చేసేందుకు ప్రయత్నించడమేనని అభిమానులు ఊహిస్తున్నారు. రాజీ, సామ్ బహదూర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన మేఘనా గుల్జార్ బాలీవుడ్ లో స్పెషలిస్ట్ డైరెక్టర్ గా స్థిరపడ్డారు.