Begin typing your search above and press return to search.

ర‌కుల్ వేగం అక్క‌డా త‌గ్గిన‌ట్లుందే!

గ‌డిచిన రెండేళ్ల కాలంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఏ రేంజ్ లో సినిమాలు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 9:30 PM GMT
ర‌కుల్ వేగం అక్క‌డా త‌గ్గిన‌ట్లుందే!
X

గ‌డిచిన రెండేళ్ల కాలంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఏ రేంజ్ లో సినిమాలు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌లేదు. చిన్న పెద్ద అనే సినిమా లేకుండా ప‌నిచేసింది. ఒకానొక ద‌శ‌లో అమ్మ‌డి వేగం చూసి కిలాడీ అక్ష‌య్ కుమార్ నే ప‌క్క‌కు నెట్టేస్తుందా? అన్న సందేహం సైతం తెర‌పైకి వ‌చ్చింది. అంత‌టి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా సినిమాలు చేసింది. అయితే 2024లో మాత్రం ఆ వేగంగా బాగా త‌గ్గింది.


ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఏడాది కేవ‌లం `ఆయ‌లాన్`, `ఇండియ‌న్-2` సినిమాల‌తో మాత్ర‌మే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వీటిలో ఆయ‌లాన్ మాత్ర‌మే స‌క్సెస్ అయింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఇండియ‌న్-2 మాత్రం డిజాస్ట‌ర్ గా మిగిలింది. మ‌రి ప్ర‌స్తుతం అమ్మ‌డి లైన‌ప్ ఎలా ఉంది? అంటే పూర్తిగా డ‌ల్ గానే క‌నిపిస్తోంది. `ఇండియ‌న్ -2`కి కంటున్యూటీగా `ఇండియ‌న్-3` లోనూ క‌నిపిస్తుంది. కాబ‌ట్టి ఆ చిత్రాన్ని కౌంట్ చేయాల్సిన ప‌నిలేదు.


మ‌రి చేతిలో ఉన్న సినిమా లెక్క‌? ఏంటి అంటే కేవ‌లం ఒక్క చిత్రం మాత్ర‌మే ఉంది. అదే `దే దే ప్యార్ దే-2`. ఈ సినిమా త‌ప్ప ఇంకే సినిమా చేతిలో లేదు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో రిలీజ్ అవుతుంది. అంత‌వ‌ర‌కూ ర‌కుల్ సినిమాల కోసం ఎదురు చూడాల్సిన ప‌నిలేదు. మొత్తంగా చూస్తే ర‌కుల్ డైరీ ఇప్పుడు పూర్తి ఖాళీగా క‌ని పిస్తుంది. స‌క్సెస్ వ‌స్తే త‌ప్ప కొత్త సినిమాలు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

ఇక సోష‌ల్ మీడియాలో మాత్రం అమ్మ‌డు నిత్యం యాక్టివ్ గానే కొన‌సాగుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌ను హీటెక్కిస్తుంది. పెళ్లైనా అమ్మ‌డు ఏమాత్రం వేగం త‌గ్గించ‌లేదు. తాజాగా ఎల్లో ఇండియా క‌వ‌ర్ పేజీపై త‌ళుక్కున మెరిసింది. బ్లూ కాంబినేష‌న్ దుస్తుల్లో మిరుమిట్లు గొలుపుతుంది. అమ్మ‌డి మ్యాక‌ప్ అలంక‌ర‌ణ ప్ర‌తీది ర‌కుల్ బ్యూటీని అంత‌కంత‌కు రెట్టింపు చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.