Begin typing your search above and press return to search.

అతిలోక సుంద‌రిలా న‌టించ‌డం అసాద్యం!

ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Oct 2024 9:30 AM GMT
అతిలోక సుంద‌రిలా న‌టించ‌డం అసాద్యం!
X

ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లిన నాటి నుంచి ఏదో సినిమాతో బిజీగానే ఉంది. ప్రేమించి నిర్మాత జాకీ భ‌గ్నాని వివాహం చేసుకుంది. అత‌డిప్పుడు కొన్ని ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నా ర‌కుల్ భ‌ర్త‌కు స‌హ‌కారంగా నిలుస్తుంది. తాను చేయాల్సిం ద‌ల్లా వెనుకుండి చేస్తుంది. జాకీ భ‌గ్నానీ నిర్మించిన సినిమాలు వ‌రుస‌గా వైఫ‌ల్యం చెంద‌డంతోనే ఈప‌రిస్థితి త‌లెత్తింద‌న్న‌ది తెలిసిందే.

అయినా ర‌కుల్ వెన్నెంటే ఉండి ధైర్యాన్ని అందిస్తూ ముందుకు సాగుతుంది. ఓ వైపు న‌టిగా కొన‌సా గుతూనే మ‌రోవైపు ఇల్లాలుగా ఇంటిని చ‌క్క‌దిద్దుతుంది. ఆ సంగ‌తి పక్క‌న‌బెడితే ర‌కుల్ కి తెలుగు సినిమాలో ఆమ‌ధ్య ఓ గొప్ప అవ‌కాశం వ‌చ్చిన సంగ‌తి తెలిసిదే. లెజెండ‌రీ న‌టులు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో భాగంగా శ్రీదేవి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ర‌కుల్ నే విరించింది. ఎంతో మంది సీనియ‌ర్ న‌టీమ ణులున్నా? వాళ్లంద‌ర్నీ కాద‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ర‌కుల్ ఏరికోరి తీసుకున్నారు.

ర‌కుల్ ఫేస్ కూడా కాస్త శ్రీదేవి రూపానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది అన్న కార‌ణంగా ఆ ఛాన్స్ వ‌రించింది. ద‌ర్శ‌కుడు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ర‌కుల్ నిల‌బెట్టిందనుకోండి. తాజాగా శ్రీదేవి పాత్ర గురించి త‌న మ‌న‌సులో ఏమ‌నుకుంటుందో రివీల్ చేసింది. ` నా కెరీర్ లో మ‌ర్చిపోలేని అద్భుత‌మైన క్ష‌ణాల్లో ఇది ఒక‌టి. ఇందులో శ్రీదేవి పాత్ర‌లో న‌టింట‌చ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఓ గొప్ప గౌర‌వం.

నాకు తెలిసి ఆమెలాంటి వారు ఎవ‌రూ ఉండ‌రు. త‌నలా న‌టించ‌డం కూడా అసాధ్యం అన్న‌ది నా అభిప్రాయం. ఆమె పాత్ర ఓ గొప్ప అన‌భూతినిచ్చింది. శ్రీదేవి అన్ని భాష‌ల్లోనూ న‌టించారు. అలా న‌టించ‌డం చిన్న విష‌యం కాదు. మూడు షిప్టులు ప‌నిచేసిన న‌టి. ఆమె అంటేనాకెంతో అభిమానం` అన్నారు.