ఆ వాలెంటైన్స్ డేను ఎప్పటికీ మర్చిపోలేను: రకుల్
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది.
By: Tupaki Desk | 14 Feb 2025 8:49 AM GMTటాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. రకుల్ చివరిగా ఇండియన్2 సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ మూవీలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేసిన రకుల్ ప్రస్తుతం తన భర్త నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తోంది.
రకుల్ బాలీవుడ్ యాక్టర్ కం ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021 నుంచి ప్రేమలో ఉన్న రకుల్, జాకీ గతేడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. తన లైఫ్ లో వాలెంటైన్స్ డే ను మరిచిపోలేనని చెప్తోంది రకుల్ ప్రీత్ సింగ్. 2022లో వచ్చిన కఠ్ పుతలీ సినిమా టైమ్ నుంచి జాకీకి తనకు ప్రేమ మొదలైందని రకుల్ వెల్లడించింది.
ఆ ఇయర్ లోనే తామిద్దరూ కలిసి మొదటి వాలెంటైన్స్ డే జరుపుకున్నట్టు తెలిపింది రకుల్. ఓ హోటోల్లోని గ్రీన్ హౌస్ ఏరియాలో జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి ఓ వైపు గిటారిస్టుల పాటలు వింటుండగా, తన కోసం గులాబీ పూలు, బొకేలు తెచ్చి సర్‌ప్రైజ్ చేశాడని, ఆ వాలెంటైన్స్ డే తనకెప్పటికీ గుర్తుండిపోతుందని రకుల్ తెలిపింది.
జాకీ లాంటి భర్త రావడం తన అదృష్టమని, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని, తాను చాలా హైపర్ అని, జాకీ కూల్ అని అందుకే లైఫ్ చాలా బ్యాలెన్డ్స్ గా ఉందని చెప్తున్న రకుల్, ఏ విషయం గురించైనా తామిద్దరం కలిసి ఓపెన్ గా మాట్లాడుకుంటామని, ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటామని, పెళ్లికి ముందు తామెలా ఉన్నామో ఇప్పటికీ అంతే ఉన్నామని చెప్పుకొచ్చింది.
భార్యాభర్తల మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉండాలంటే దానికి నమ్మకం ఎంతో ముఖ్యమని, ఒకరినొకరు పూర్తిగా నమ్మాలని, ఆ నమ్మకమే బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేస్తుందని చెప్తున్న రకుల్, పార్టనర్‌లో మంచి ఫ్రెండ్ ను చూసుకుంటే ఆ బంధం ఎప్పుడూ బలంగా ఉంటుందని, జీవితం హ్యాపీగా ముందుకెళ్లాలంటే నమ్మకం, స్నేహం, విశ్వాసం ఎంతో ముఖ్యమని చెప్పింది. ఇక పెళ్లి తర్వాత జీవితం గురించి చెప్తూ తన జీవితం పెళ్లయ్యాక మరింత బెటర్ అయిందని, అన్నీ అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని రకుల్ తెలిపింది.