Begin typing your search above and press return to search.

రకుల్ మసాలా అందం..లెగ్స్ తోనే హీట్ పెంచేసిందిగా

ఒక ఫోటోషూట్‌లో తెల్లని మోడ్రన్ అవుట్ఫిట్‌లో మెరిసిపోతూ ఆమె అభిమానులను మంత్రముగ్ధులను చేశారు.

By:  Tupaki Desk   |   16 Nov 2024 9:15 AM GMT
రకుల్ మసాలా అందం..లెగ్స్ తోనే హీట్ పెంచేసిందిగా
X

రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ గ్లామర్ డోస్ పెంచేసింది. బాలీవుడ్ కు వెళ్లిన తరువాత ఊహించని ట్రాక్ లో వెళుతున్న అమ్మడు సోషల్ మీడియాలో కూడా గ్లామరస్ బ్యూటీలకు గట్టి పోటీని ఇస్తోంది. ఒక ఫోటోషూట్‌లో తెల్లని మోడ్రన్ అవుట్ఫిట్‌లో మెరిసిపోతూ ఆమె అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ లుక్స్‌లో ఆమె అందం, హుందాతనం మరింత పెరిగి, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రేజ్ పొందింది.

"మసాలా" మ్యాగజైన్ కవర్ పేజ్‌లో ఆమె ఈ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ పొగడ్తలతో కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. రకుల్ ప్రీత్ తన సినీ ప్రస్థానాన్ని టాలీవుడ్‌లో "కెరటం" సినిమాతో స్టార్ట్ చేసింది. అయితే, "వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్" సినిమాతో తొలి సక్సెస్‌ను అందుకుని, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తక్కువ సమయంలోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్‌ను అందుకుంది.

ఆ తర్వాత తమిళ పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందిన అమ్మడు, ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. అక్కడ ఆమె నటనను నిరూపించుకుంటూ వరుసగా అవకాశాలు అందికుంది. "దే దే ప్యార్ దే," "మేడే" వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. అయితే ఇటీవల వచ్చిన "ఇండియన్ 2" డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ ఫామ్ కోల్పోయినట్లయ్యింది.

ఇన్ స్టాగ్రామ్ లో 23.7 మిలియన్ ఫాలోవర్స్‌తో రకుల్ ప్రీత్ మంచి క్రేజ్ అందుకుంటోంది. తన గ్లామర్ ఫోటోషూట్స్ తో పాటు, జీవితంలోని ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ, నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఫిట్నెస్ వీడియోలతో పాటు గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఆమె యువతరాన్ని ఆకట్టుకుంటోంది. ఇక రకుల్ ప్రీత్ జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌పై సమర్పణతో ముందుకు సాగుతోంది. కొత్త ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ తన ప్రత్యేకతను చుపిస్తోంది.