Begin typing your search above and press return to search.

జీరో సైజ్ కోసం జీవితాన్ని ఖ‌ర్చు చేసిన హీరోయిన్

ప్ర‌తిభ తో పాటు వేప‌కాయంత వెర్రి ఉన్న వాళ్ల‌ను కూడా చూస్తుంటాం. అందానికి అందం ప్ర‌తిభ ఉన్నా కానీ కొంద‌రికి కొన్ని ర‌కాల పిచ్చి వ్యాప‌కాలు ఉంటాయి

By:  Tupaki Desk   |   25 Dec 2024 9:30 PM GMT
జీరో సైజ్ కోసం జీవితాన్ని ఖ‌ర్చు చేసిన హీరోయిన్
X

ప్ర‌తిభ తో పాటు వేప‌కాయంత వెర్రి ఉన్న వాళ్ల‌ను కూడా చూస్తుంటాం. అందానికి అందం ప్ర‌తిభ ఉన్నా కానీ కొంద‌రికి కొన్ని ర‌కాల పిచ్చి వ్యాప‌కాలు ఉంటాయి. అలాంటి వ్యాప‌కానికి ప్ర‌ముఖ హీరోయిన్ త‌న జీవితాన్ని ఖ‌ర్చు చేసింది. ఇప్పుడు త‌న‌ని చూడ‌గానే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మేమో! అనేంత‌గా మారిపోతోంది. ఇంత‌కీ ఏమిటా పిచ్చి? అంటే `జీరోసైజ్` మ్యాడ్ నెస్. స‌న్న‌జాజిలా మైన‌స్ రూపానికి మారి ఇంకా ఏదో సాధించాల‌నుకుంటోంది.

ఉన్న‌ట్టుండి త‌న ఫేస్‌లో, బాడీ లాంగ్వేజ్ లో వ‌చ్చిన ఈ మార్పుకు కార‌ణం ఏమిటా? అన్న‌ది ఆరా తీస్తే అస‌లు సంగ‌తి తెలిసింది. స‌ద‌రు స్టార్ హీరోయిన్ స‌రిగా తిన‌డం కూడా మానేసి జీరో సైజ్ కోసం పాకులాడుతోంది. నిజం చెప్పాలంటే జీరోసైజ్ ట్రెండ్ ఎప్పుడో క‌నుమ‌రుగైంది. బొద్దుగా ముద్దొచ్చే భామ‌ల‌కు ఆద‌ర‌ణ ద‌క్కుతున్న మోడ్ర‌న్ డేస్ ఇవి. కానీ ఇంకా ఆ భామ జీరో సైజ్ కోసం చాలా పాకులాడుతోంది. ఈ పాకులాట‌లో త‌న‌కు ఉన్న అందం మొత్తాన్ని పోగొట్టుకుంటోంది. దీంతో స‌ద‌రు హీరోయిన్ ఇలాంటి ప‌నులు ఆపేయాల‌ని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఫుల్లుగా తిని, కంటి నిండా నిదురించి, చ‌క్క‌గా సినిమాలు చేసుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు.

అయితే స‌ద‌రు హీరోయిన్ ఇలా జీరో సైజ్ కోసం ఇంత‌ పిచ్చిగా మార‌డానికి కార‌ణం.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయం. ఇటీవ‌ల అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల్లేవ్. అటు న‌మ్ముకున్న బాలీవుడ్ త‌న‌ను దూరం పెడుతోంది. ఇటు వ‌దులుకున్న సౌత్ కూడా త‌న‌వైపు చూడ‌టం లేదు. ప‌నిలో ప‌నిగా కొత్త‌త‌రం దూసుకొస్తూ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌కుండా చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో న‌ట‌న‌లో కెరీర్ లేక‌పోయినా కనీసం త‌న‌కు ఉన్న స్టార్ ఇమేజ్‌ని ఉప‌యోగించుకుని బ్రాండ్ ప‌బ్లిసిటీతో అయినా ఆర్జించాల‌ని క‌ల‌లు కంటోంది. ఇక బాలీవుడ్ లో అగ్ర నిర్మాత‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ...త‌న భ‌ర్తకు చెందిన ప్రొడ‌క్ష‌న్ సంస్థ న‌ష్టాల్లోకి వెళ్ల‌డంతో చాలా త‌ల్ల‌డిల్లిన‌ట్టు ముంబై మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. డార్క్ చాక్లెట్ పేరుతో ఇటీవ‌ల ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోషూట్ కోసం స‌ద‌రు న‌టీమ‌ణి ఫోజులివ్వ‌గా జీరో సైజ్ లుక్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఎపిసోడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా?... నో డౌట్.. ర‌కుల్ ప్రీత్ సింగ్.