పిక్‌టాక్ : భర్తతో రకుల్ రొమాంటిక్ ఫోజ్
తాజాగా ఈమె భర్త జాకీ భగ్నానీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. రొమాంటిక్‌గా భర్తతో ఉన్న ఫోటోను రకుల్ షేర్ చేసింది.
By: Tupaki Desk | 11 March 2025 6:00 PM ISTటాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గిన వెంటనే తన చిరకాల ప్రేమికుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్లుగానే జాకీ భగ్నానీతో వైభవంగా రకుల్ వివాహం జరిగింది. గోవాలో జరిగిన వీరి వివాహంకు కుటుంబ సన్నిహితులు, స్నేహితులు, బంధువుల హాజరు అయ్యారు. ఫిబ్రవరి 21, 2024న వీరి వివాహం జరిగిన విషయం తెల్సిందే. జాకీ భగ్నానీతో వివాహం జరిగి ఏడాది పూర్తి కాబోతున్న నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవ్స్‌కి మొదటి వివాహ వార్షికోత్సవ వేడుక కోసం వెళ్లింది.
మాల్దీవ్స్ నుంచి రెగ్యులర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె భర్త జాకీ భగ్నానీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. రొమాంటిక్‌గా భర్తతో ఉన్న ఫోటోను రకుల్ షేర్ చేసింది. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఒకరి మొహంలోకి ఒకరిని చూసుకుంటూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. పెళ్లి అయి ఏడాది అవుతున్నా కొత్త జంట మాదిరిగానే వీరిద్దరు ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించాలని చాలానే ప్రయత్నాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది.
పెళ్లి తర్వాత బాలీవుడ్‌లో ఈమెకు ఆఫర్లు దక్కాయి. కానీ అవి సక్సెస్‌ను తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాల ఫలితాలపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. కనీసం ఆ సినిమాలు హిట్ అయినా మళ్లీ బిజీ అవ్వాలని రకుల్ ఆశతో ఎదురు చూస్తుంది. ముఖ్యంగా తన సూపర్ హిట్ హిందీ మూవీ దే దే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఆ సినిమా సీక్వెల్‌తో సక్సెస్ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈమధ్య కాలంలో ఈమెకు ఒక్క సినిమా కూడా విజయాన్ని తెచ్చి పెట్టలేదు. కనుక ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనే విషయమై అనేక అనుమానాలు ఉన్నాయి.
ఒకప్పుడు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు సౌత్ హీరోయిన్స్ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా పెళ్లి తర్వాత కూడా ఎప్పటిలాగే మరింత అందంగా కనిపిస్తూ సినిమాల్లో నటించేందుకు హీరోయిన్స్ రెడీగా ఉన్నారు. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించాలని ఆరాటపడుతోంది. గ్లామర్ షోకి, రొమాంటిక్ సన్నివేశాలకు సైతం ఈమె ఓకే చెబుతూ సినిమాలకు కమిట్ అవుతుంది. రకుల్ అందం ఏమాత్రం తగ్గలేదని మరో పదేళ్లు ఈమె హీరోయిన్‌గా కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.