రకుల్.. లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో వేరే లెవెల్ ఫ్యాన్స్ బేస్ ఆమె సొంతం.
By: Tupaki Desk | 2 March 2025 3:52 AM GMTరకుల్ ప్రీత్ సింగ్.. పంజాబీ బ్యూటీ అయిన అమ్మడు.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో అలరించిందన్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో వేరే లెవెల్ ఫ్యాన్స్ బేస్ ఆమె సొంతం.
కాలేజ్ టైమ్ లోనే మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన రకుల్.. 2009లో కన్నడ మూవీ గిల్లితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో మెప్పించింది. అనంతరం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అలా స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుందనే చెప్పాలి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న ముద్దుగుమ్మ.. అనుకున్నంతగా హిట్లు మాత్రం అందుకోలేకపోతుందనే చెప్పాలి. అయినప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. నాన్ స్టాప్ గా సినిమాలో సందడి చేస్తోంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో రకుల్ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. రకరకాల ఔట్ ఫిట్స్ తో ఫోటోలు దిగుతూ చేసే సందడి వేరే లెవెల్. ఆమె పిక్స్.. ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. అందరినీ ఆకట్టుకుని ట్రెండింగ్ లో నిలుస్తుంటాయి.
రీసెంట్ గా వన్ పీస్ షైనింగ్ డ్రెస్ లో వేసుకుని సందడి చేసింది రకుల్. ఫుల్ మోడ్రన్ గా ఆ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. రకరకాల పోజులు ఇచ్చి మైండ్ బ్లాక్ చేసిందనే చెప్పాలి. మెయిన్ గా లగ్స్ అందాలతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ.. లుక్ బ్యాక్ ఎట్ మీ అంటూ ఇచ్చిన క్రేజీ క్యాప్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రస్తుతం రకుల్ పిక్స్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలు అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అట్రాక్ట్ అయిపోతున్నామని చెబుతున్నారు. ఎవర్ గ్రీన్ బ్యూటీ అని అంటున్నారు. గ్లామరస్ స్కిన్ తో ఫిదా చేసిందని పొగిడేస్తున్నారు.