25 ఏళ్లు వచ్చే వరకూ రకుల్ వెంట మమ్మీ!
పరిశ్రమ బాగా అలవాటై..అంతా పరిచయస్తులుంటే వాళ్ల మమ్మీలకు ఓ నమ్మకం దొరుకుతుంది.
By: Tupaki Desk | 20 Feb 2024 5:56 AM GMTఇండస్ట్రీకి వచ్చే కొంత మంది హీరోయిన్ల వెంట తప్పకుండా వాళ్ల మమ్మీలుంటారు. కుమార్తెల్ని మమ్మీలు వెంటాడటం అన్నది మోడలింగ్ నుంచే మొదలవుతుంది. కొందరు నేరుగా హీరోయిన్లు అయితే గనుక అక్కడ నుంచి మమ్మీల ప్రస్తాన కూడా కనిపిస్తుంటుంది. హీరోయిన్ల వెంట మమ్మీలుంటే? అన్ని వేళల అన్ని రకాల సంరక్షణ దొరుకుతుందని హీరోయిన్లు భావిస్తుంటారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే వరకూ కచ్చితంగా మమ్మీలు కనిపిస్తుంటారు.
పరిశ్రమ బాగా అలవాటై..అంతా పరిచయస్తులుంటే వాళ్ల మమ్మీలకు ఓ నమ్మకం దొరుకుతుంది. ఇక్కడ బిడ్డ సెక్యూర్ గానే ఉంటుంది అన్న నమ్మకం కలిగిన తర్వాత తిరిగెళ్లిపోతుంటారు. అప్పటివరకూ హీరో యిన్ తోక లాగే వెంట తిరుగుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్ ని ఎక్కడైనా ఒంటరిగా విడిచిపెడతారు గానీ... షూటింగ్ సెట్స్ లో మాత్రం అస్సలు విడిచిపెట్టరు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి అనుభవన్నే ఎదుర్కుంది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా రివీల్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ని వాళ్ల మమ్మి 25 ఏళ్లు వచ్చే వరకూ తన వెంటే ఉందిట. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అస్సలు విడిచిపెట్టి ఉండేవారు కాదుట. ఇండస్ట్రీలో తాను కుదురుకునే వరకూ తన వెంట ఉండి అన్ని రకాలుగా సహాయం అందించిందని తెలిపింది. అలాగే ఈ రంగంలో రకుల్ తొలి సంపాదన 5 వేలు అట. మోడలింగ్ సమయంలోనే అంత మొత్తం అందు కుందిట. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రత్యేకించి తల్లిదండ్రులే కారణమంటోంది.
వాళ్ల సహకారం లేనిదే తాను ఏది సాధించలేనని అంది. ఆ మాత్రం సహకారం లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కునే దాన్ని అని గుర్తు చేసుకుంది. మోడల్ గా కెరీర్ ఆరంభించిన అమ్మడు అటుపై హీరోయిన్ గా ఎదగడం తెలిసిందే. ప్రస్తుతం అమ్మడు నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం బుధవారం ఘనంగా గోవాలో జరుగుతుంది. ఈ వేడుక కేవలం ఇరు కుటుంబాలు..సన్నిహితులు..స్నేహితుల సమక్షంలోనే జరుగుతుంది.