Begin typing your search above and press return to search.

ఆ విషయాలు చెప్పి తెగ మురిసి పోతున్న రకుల్‌

పెళ్లి తర్వాత రకుల్‌ మొదటి సారి తన భర్త జాకీ భగ్నానీ గురించి కామెంట్స్ చేసింది. జాకీ వంటి భర్త తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

By:  Tupaki Desk   |   9 March 2024 1:30 PM GMT
ఆ విషయాలు చెప్పి తెగ మురిసి పోతున్న రకుల్‌
X

హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇటీవలే తన ప్రియుడు జాకీ భగ్నానీ ని వివాహం చేసుకుంది. వీరి వివాహం గోవాలో వైభవంగా జరిగింది. అయిదు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరిగినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇద్దరి జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లికి ముందు చాలా కాలం క్రితమే జాకీ భగ్నానీ తో ప్రేమ విషయాన్ని ప్రకటించింది. అయితే ఇద్దరు కలిసి పార్టీ లు పబ్‌ లు అంటూ పెద్దగా తిరిగింది ఏమీ లేదు. ఇద్దరు చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియా లో కనిపిస్తూ ఉండే వారు. ఇతర జంటలతో పోల్చితే వీరి జంట చాలా స్పెషల్‌ అంటూ చాలా సందర్భాల్లో మీడియాలో చర్చ జరిగింది.

పెళ్లి తర్వాత రకుల్‌ మొదటి సారి తన భర్త జాకీ భగ్నానీ గురించి కామెంట్స్ చేసింది. జాకీ వంటి భర్త తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. తనకు మొదటి నుంచి కూడా జాకీ యొక్క సెన్సాఫ్‌ హ్యూమర్‌ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది.

తాను నవ్వుతూ పక్కన వాళ్లను కూడా నవ్వించడం అతడి స్పెషాలిటీ. అతడి యొక్క మంచితనం నాకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరితో కూడా చాలా సరదాగా ఉంటాడు. అందుకే నేను అతడిని ఇష్టపడ్డాను అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్ చెప్పుకొచ్చింది.

మొత్తానికి రకుల్‌ తన భర్త గురించి చెబుతూ తెగ మురిసి పోతుంది. తనకు ఇలాంటి భర్త లభించడం అదృష్టం అంటూ కూడా మాట్లాడుతూ ఉంది అంటే ఎంతగా రకుల్‌ అతడిని ప్రేమిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మీ జంట ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలని నెటిజన్స్‌ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.