తల్లిదండ్రుల్ని ఎదురించి ముంబైలో రకుల్ ఒంటరి పోరాటం!
చేతిలో సినిమా హిందీ సినిమాలైతే కనిపిస్తున్నా యి గానీ...ఇంతవరకూ ఒక్క సక్సెస్ కూడా ఖాతా వేసుకోలేదు. అయినా అమ్మడిని అవకాశాలు వెంటాడుతు న్నాయి.
By: Tupaki Desk | 7 Oct 2023 5:56 AM GMTఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతుంది. వరుసగా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన తర్వాత అమ్మడు బాలీవుడ్ కెళ్లి బిజీ అయింది. చేతిలో సినిమా హిందీ సినిమాలైతే కనిపిస్తున్నా యి గానీ...ఇంతవరకూ ఒక్క సక్సెస్ కూడా ఖాతా వేసుకోలేదు. అయినా అమ్మడిని అవకాశాలు వెంటాడుతు న్నాయి.
ఇప్పటికే 2024 క్యాలెండర్ కూడా ఫుల్ అయిపోయింది. అటు ' ఇండియన్ -2' లాంటి పాన్ ఇండియా సినిమా కూడా చేస్తోంది. ఇదంతా ఇప్పుడు. మరి ఒకప్పుడు రకుల్ ఏంటి? అంటే జీరో అనే అంటోంది.
'సినిమా బయట వాళ్లకి అందమైన ప్రపంచంలా కనిపిస్తుంది. అందులోకి దిగిన తర్వాత తొలు ఎంతో తెలుస్తుంది. ఇక్కడ రానించడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాటన్నింటిన తర్వాతనే అందమైన ప్రపంచం కనిపిస్తుంది. చిన్న నాటి నుంచి సినిమాలంటే ఆసక్తి. సినిమాల గురించి పూర్తిగా తెలియకుండా మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి అందరిలా ఇబ్బందులు పడ్డాను. అవమానాలు సహించాను. నా కొరిక బలమైంది కాబట్టి తల్లిదండ్రులు వద్దన్నా వారి మాట వినకుండా ముంబై వచ్చాను. అక్కడే నా ఒంటరి జీవితం ప్రారంభమైంది.
నాటి నుంచి సక్సెస్ అయ్యే వరకూ చాలా సమస్యలు ఎదుర్కున్నాను. అందరిలాగే క్యూలో నిలబడి వేచి చూసేదా న్ని..క్యాస్టింగ్ ఏజెంట్లకు..దర్శకులకు ఫోన్లు చేసి అవకాశం ఇవ్వండని అడిగేదాన్ని. కొన్నిసార్లు ఎంపిక చేసినట్లు చేసి తప్పించేవారు. నేను చేయాల్సిన పాత్రలు వేరే వాళ్లకు వెళ్లిపోయేవి. ఇలాంటి అనుభవాలు చాలాసార్లు ఎదురయ్యాయి. నేను పడుతోన్న శ్రమ గురించిన తల్లిదండ్రులు ప్రోత్సహిం చారు. వాళ్లు అలా చేసారు కాబట్టే నేను సక్సస్ అయ్యాను. వాళ్లో తీరునా? నేనొక తీరున ఉంటే మరిన్ని కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యేవి' అని అన్నారు.