కవర్ పేజీపై కొత్త దంపతుల మెరుపులు!
నుదిటిన పాపిడి బొట్టు..మెడలో పొడి డిజైన్ తో కూడిన ఏడు వారాల నగలు.. చేతులకు అంతే మందైన డిజైన్ తో కూడిన గాజులు ధరించింది.
By: Tupaki Desk | 23 Feb 2024 10:54 AM GMTరకుల్ ప్రీత్ సింగ్ -జాకీ భగ్నానీ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ప్రేమ బాంధవ్యానికి పుల్ స్టాప్ పెట్టి పెళ్లితో ఒకటయ్యారు. ఇక జోడీ పెళ్లి సెలబ్రేషన్స్ లో భాగంగా ఎంత అందంగా ముస్తాబ య్యారో? వర్ణించడానికి మాటలు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. ముందొస్తు పెళ్లి వేడుక ధోల్ నైట్ నుంచి వివాహం జరిగే వరకూ డిజైనర్ దుస్తుల్లో దంపతుల అలంకరణ ఎంతో ప్రత్యేకంగా హైలైట్ అయింది.
పార్టీలో సంప్రదాయ దుస్తుల్లో మ మెరిసిపోగా.. గ్రీన్ కలర్ షమ్మిరీ షరారా ధరించి డైమండ్ చోకర్ నెక్లెస్ లో రకుల్ దర్శనమివ్వగా.. జాకీ కలర్ బ్లాక్ ఔట్ ఫిలో మెరిసాడు. ఇంకా సంగీత..వివాహా వేడుక కోసం మరింత ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల్లో తళకులీనారు. తరుణ్ తహిలియాని లెహంగా లో రకుల్ ఎంతో అందంగా ముస్తాబైంది. ధగధగలాడిపోతున్న డిజైనర్ దుస్తులకు మ్యాచింగ్ జ్యూయలెరీ అంతే అందంగా కుదిరింది.
నుదిటిన పాపిడి బొట్టు..మెడలో పొడి డిజైన్ తో కూడిన ఏడు వారాల నగలు.. చేతులకు అంతే మందైన డిజైన్ తో కూడిన గాజులు ధరించింది. ముఖానికి సమపాళ్లలో మ్యాకప్ అన్ని పక్కాగా కుదిరాయి. రకుల్ ని మ్యాచ్ చేస్తూ జాకీ కూడా అంతే మనోహరంగా ముస్తాబయ్యాడు. డ్రెస్ నుంచి ప్రతీది పక్కాగా రకుల్ ని మ్యాచ్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫోటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వివాహానికి సంబంధించిన ఈ అందమైన ఫోటోలు మాత్రం బ్రైడ్స్ టుడే కవర్ పేజీకి విక్రయించినట్లు తెలుస్తోంది.
ఆ మ్యాగజైన్ రకుల్-జాకీ ముస్తాబైన ఫోటోల్ని ప్రత్యేకంగా ప్రచురించి హైలైట్ చేస్తుంది. కవర్ పేజీలో బ్యాక్ గ్రౌండ్ గ్రీనరీలో ఈ జంట మరింత అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. రకుల్ అభిమానులు కొత్త పెళ్లికూతుర్ని అలా చూసి మురిసిపోతున్నారు.