Begin typing your search above and press return to search.

ర‌కుల్ ప్రీత్ పూల్‌సైడ్ ట్రీట్.. న‌దిలో భ‌ర్త‌తో విహారం!

కొన్ని భారీ చిత్రాల ప‌రాజ‌యం కార‌ణంగా వంద‌ల కోట్ల మేర బాక్సాఫీస్ న‌ష్టాల‌ను చ‌వి చూసిన ఈ సంస్థ తిరిగి అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:30 PM GMT
ర‌కుల్ ప్రీత్ పూల్‌సైడ్ ట్రీట్.. న‌దిలో భ‌ర్త‌తో విహారం!
X

ఇటీవ‌ల భ‌గ్నానీల నిర్మాణ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్ర‌చారం సాగింది. కొన్ని భారీ చిత్రాల ప‌రాజ‌యం కార‌ణంగా వంద‌ల కోట్ల మేర బాక్సాఫీస్ న‌ష్టాల‌ను చ‌వి చూసిన ఈ సంస్థ తిరిగి అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఇవేవీ ప‌ట్ట‌న‌ట్టు ఈ సంస్థ అధిప‌తుల్లో ఒక‌రైన‌ యువ‌న‌టుడు, నిర్మాత అయిన జాకీ భ‌గ్నానీతో అత‌డి స‌తీమ‌ణి ర‌కుల్ ప్రీత్ సింగ్ విహార‌యాత్ర‌లు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి.

ర‌కుల్ ఫుల్ ఫ్రీడ‌మ్‌ని ఆస్వాధిస్తోంది. భ‌ర్త జాకీ భ‌గ్నానీతో క‌లిసి వెల్ నెస్ ట్రిప్ ని ప్లాన్ చేసింది. ఈ జంట అంద‌మైన న‌దీతీర ప్రాంతంలో జాలీ రైడ్ లు ఆస్వాధిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను ర‌కుల్ ప్రీత్ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ర‌కుల్ స్విమ్ సూట్ ధ‌రించి న‌దిలోకి జంప్ చేస్తున్న ఒక వీడియో , ఫోటోలు కూడా వేగంగా వైర‌ల్ అవుతున్నాయి. అలాగే న‌దిలో వాట‌ర్ స్పోర్ట్స్ ని అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్ ని ఆస్వాధిస్తూ అంద‌రి క‌ళ్ల‌ను త‌మ‌వైపు తిప్పేసుకుంది ఈ జంట‌.

ఈ వారం ఇప్పుడే ప్రయాణించి వ‌చ్చాం.. నా బెస్ట్ గై జాకీ భ‌గ్నానీ.. కొంత స‌మ‌యం ఆనందంగా గ‌డిపాను అంటూ ర‌కుల్ అస‌లు విష‌యం తెలిపింది. దీనికి ప్ర‌గ్య జైశ్వాల్ స‌హా ప‌లువురు స‌హ‌న‌టీమ‌ణులు ల‌వ్ హార్ట్ ఈమోజీల‌తో ప్ర‌తి స్పందించారు.

ర‌కుల్ కెర‌టం అనే చిన్న చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సందీప్ కిష‌న్ వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ తో విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్‌ వంటి అగ్ర తార‌ల స‌ర‌స‌న న‌టించింది. త‌మిళంలోను పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించింది. కానీ చివ‌రికి బాలీవుడ్ లో స్థిర‌ప‌డి అక్క‌డే సినీనిర్మాత‌ జాకీ భ‌గ్నానీని పెళ్లాడింది. మిగ‌తా క‌థంతా తెలిసిన‌దే.