'ఆనంద్ కరాజ్'లో రకుల్ పెళ్లి.. దీనర్థం?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఎట్టకేలకు పవిత్ర వివాహ బంధంతో ఒక్కటయ్యారు
By: Tupaki Desk | 21 Feb 2024 3:25 PM GMTస్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఎట్టకేలకు పవిత్ర వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట గోవాలో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో 'ఆనంద్ కరాజ్' వేడుకలో వివాహం చేసుకున్నారు. వారి తరపు బంధువుల బృందం దీనిని ధృవీకరించింది. ఇప్పుడు సింధీ విధానంలోను పెళ్లి చేసుకోనున్నారు. ఈ జంట మొదటి అధికారిక పెళ్లి ఫోటోలు విడుదల కావాల్సి ఉంది.
మార్చి 19న గోవాలో హల్దీ వేడుకతో రకుల్-జాకీ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రారంభించారు. తరువాత ఈ జంట మెహందీ, సంగీత్ ఫంక్షన్‌లను కూడా నిర్వహించారు. ఈ వేడుకల్లో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కనిపించారు. గోవాలో జరుగుతున్న ఈ జంట వివాహానికి అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, వరుణ్ ధావన్ తదితరులు హాజరయ్యారు. అయితే టాలీవుడ్ నుంచి ఎవరూ ఎటెండ్ కాలేదని తెలుస్తోంది.
ఆనంద్ కరాజ్ అనేది సిక్కు వివాహ వేడుక.. అంటే 'ఆనందం వైపు చర్య' అని గురు అమర్ దాస్ పరిచయం చేశారు. వివాహ వేడుకను నిర్వహించడానికి గురు గ్రంథ్ సాహిబ్ చుట్టూ ప్రదక్షిణ చేయడం సాపేక్షంగా ఇటీవలి ఆవిష్కరణ. ఇది ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో పవిత్రమైన అగ్ని (హవాన్) చుట్టూ ప్రదక్షిణ చేసే సంప్రదాయా వివాహ విధానంగా స్థిరపడింది. తదుపరి సింధీ విధానంలోను వివాహం చేసుకోనున్నారు.
అనూహ్యంగా ప్లాన్ ఛేంజ్
ఈ జంట వాస్తవానికి విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసారు. అయితే భారతదేశంలోనే తమ వివాహ వేడుకలను నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని ప్రజలకు పిలుపునిచ్చిన తర్వాత ఈ జంట లొకేషన్‌ను మార్చారు. అలాగే గోవాలో వేడుకలను ప్లాన్ చేసారు. వారి ప్రేమ వర్ధిల్లింది కూడా ఇక్కడే. నిజానికి గోవాను ఎంపిక చేసుకోవడం వారికి సెంటిమెంట్ నిర్ణయం.. వివాహం ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుందని వారు భావించారు.
జాకీ భగ్నానీ -రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. మిషన్ రాణిగంజ్, గణపత్ పార్ట్ 1, బడే మియాన్ చోటే మియాన్ లాంటి భారీ చిత్రాలను జాకీ నిర్మించారు. మిషన్ రాణిగంజ్, గణపత్ డిజాస్టర్లుగా నిలిచాయి. బడే మియాన్ చోటే మియాన్ విడుదల కావాల్సి ఉంది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తదుపరి మేరీ పట్నీ కా రీమేక్, ఇండియన్ 2లో కనిపించనుంది. అయలాన్ (శివకార్తికేయన్-రకుల్ ) ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.