Begin typing your search above and press return to search.

రకుల్ ఆశలన్నీ వాటిమీదే..!

శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు మంచి డిమాండ్ ఉంటుంది. అతని సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కాబట్టి రకుల్ ఆ సినిమా మీద నమ్మకం పెట్టుకుంది.

By:  Tupaki Desk   |   12 Sept 2023 2:59 PM IST
రకుల్ ఆశలన్నీ వాటిమీదే..!
X

టాలీవుడ్ లో ఎంత త్వరగా స్టార్ట్ స్టేటస్ తెచ్చుకుకుందో అంతే త్వరగా ఫాం కోల్పోయింది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో మొదలైన ఆమె కెరీర్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ వచ్చేలా చేసింది. ఆ సినిమాలన్నీ ఆమె కెరీర్ కు ఉపయోగపడతాయి అనుకోగా ఒకటి రెండు ఫ్లాపులు పడగానే అమ్మడి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. తెలుగులో రకుల్ కి అవకాశాలు రావట్లేదని చెప్పొచ్చు. బాలీవుడ్ లో కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ సోసోగానే కెరీర్ కొనసాగుతుంది.

సౌత్ లో కన్నా హిందీ సినిమాల్లో రకుల్ గ్లామర్ డోస్ పెంచింది. అక్కడ అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ తో నటించిన అమ్మడు స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకపడింది. ఇక చేసేదేమి లేక వచ్చిన ఛాన్స్ ని చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం అమ్మడికి కోలీవుడ్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ చేస్తున్న ఇండియన్ 2 కాగా మరోటి శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో అయలాన్ సినిమా చేస్తుంది.

ఇండియన్ 2 లో రకుల్ రోల్ ఎంత ఉంటుంది అన్నది చెప్పడం కష్టం. ఎటొచ్చి అమ్మడు తన ఆశలన్నీ కూడా శివ కార్తికేయన్ సినిమా మీదే పెట్టుకుంది. తమిళంలో టైర్ 2 హీరో నుంచి స్టార్ హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు మంచి డిమాండ్ ఉంటుంది. అతని సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కాబట్టి రకుల్ ఆ సినిమా మీద నమ్మకం పెట్టుకుంది.

ఈ రెండు సినిమాలు రకుల్ ని తిరిగి ఫాం లోకి తెచ్చేలా చేస్తాయా లేదా అన్నది చూడాలి. ఇటు సౌత్ తో పాటుగా అటు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తున్న రకుల్ ఫ్రీ టైం ఉంటే చాలు ఫోటో షూట్స్ తో కూడా ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న అమ్మడికి లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. తెలుగులో కొండపొలం తర్వాత రకుల్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిగా లేరు. యువ హీరోల సరసన అయినా సరే తనకు నో అబ్జెక్షన్ అని అంటున్నా ఛాన్స్ లు మాత్రం రావట్లేదు. అయినా సరే రకుల్ మాత్రం ప్రయత్నం చేయడం లో మాత్రం వెనక్కి తగ్గట్లేదు.