రకుల్ రాజకీయాలు.. ఏంటి మ్యాటర్?
టాలీవుడ్ లో 2017 వరకు ఆమె స్పీడ్ కొనసాగింది. తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ భామకి అక్కడ కూడా వరుస ఆఫర్స్ వచ్చాయి
By: Tupaki Desk | 9 Sep 2023 5:05 AM GMTకెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో సక్సెస్ కొట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో పాటు టైర్ 2 హీరోలైన తేజ్, రవితేజ, రామ్ పోతినేనికి జోడీగా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.
టాలీవుడ్ లో 2017 వరకు ఆమె స్పీడ్ కొనసాగింది. తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ పంజాబీ భామకి అక్కడ కూడా వరుస ఆఫర్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం, సిద్దార్ధ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్స్ తో జతకట్టింది. సక్సెస్ లు కూడా అందుకుంది. చివరిగా ఈ భామ చైత్రివాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత తెలుగు, తమిళ్ భాషలలో భూ అనే మూవీతో వచ్చింది. అది కూడా డిజాస్టర్ గా మారింది. ఇండియన్ 2తో పాటుగా శివ కార్తికేయన్ కి జోడీగా అయ్యలాన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. హిందీలో ఒక రెండు సినిమాలు ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కి ఛాన్స్ లు లేవని చెప్పాలి. దర్శకులు ఎవరూ కూడా రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించడం లేదు.
రీసెంట్ గా ఆమె మహారాష్ట్రలో జరిగిన ఓ పొలిటికల్ ఈవెంట్ లో సందడి చేసింది. దీంతో రకుల్ కెరియర్ గురించి మరోసారి న్యూస్ తెరపైకి వచ్చింది. తెలుగులో మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్న పట్టించుకున్నవాళ్ళే లేరు. ఆమె చివరిగా కొండపొలం ద్వారా స్ట్రైట్ తెలుగు మూవీ చేసింది. తరువాత ఏ దర్శకుడు కూడా రకుల్ ప్రీత్ సింగ్ కోసం ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల రేసులో దూసుకుపోతోంది. ఇక కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నేహాశెట్టి లాంటి యాక్టర్స్ స్టార్ హీరోయిన్ రేసులో ఉన్నారు.
ఈ కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ పైన టాలీవుడ్ దర్శకులు ఎవరూ శ్రద్ధ పెట్టడంలేదని తెలుస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే తెలుగులో ఆమె కెరియర్ క్లోజ్ అయినట్లే అంటూ టాక్ నడుస్తోంది. గతంలో ఇలియానా టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న సమయంలో బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్న సమయంలోనే బాలీవుడ్ వైపు వెళ్లి తెలుగులో పూర్తిగా ఛాన్స్ లు దూరం చేసుకుంది.