Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : కలర్‌ ఫుల్‌ రకుల్‌ న్యూ ఇయర్ స్పెషల్‌

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌ సింగ్

By:  Tupaki Desk   |   3 Jan 2024 10:41 AM GMT
పిక్‌ టాక్ : కలర్‌ ఫుల్‌ రకుల్‌ న్యూ ఇయర్ స్పెషల్‌
X

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌ సింగ్. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారి స్టార్‌ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ రకుల్‌.


ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో సందడి చేసింది.

ఈసారి న్యూ ఇయర్ వేడుకను తన సన్నహితులు మరియు మిత్రులతో జరుపుకున్న రకుల్‌ ఆ ఫోటోను షేర్‌ చేసింది. రకుల్‌ షేర్‌ చేసిన ఫోటోల్లో ఆమె ప్రియుడు జాకీ భగ్నాని తో పాటు ఇంకా చాలా మంది టాలీవుడ్ మరియు బాలీవుడ్‌ సెలబ్రెటీలు ఉన్నారు.

రకుల్‌ కు అత్యంత ఆప్త మిత్రురాలిగా పేరు దక్కించుకున్న మంచు లక్ష్మి మరియు సీరత్‌ కపూర్‌ ఇంకా ప్రగ్యా జైస్వాల్‌ లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. రకుల్‌ న్యూ ఇయర్ పార్టీ పిక్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఒక లుక్కేయండి.