Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు ర‌కుల్ చేసిన ఈ ప‌ని చూశారా?

అందాల‌ రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని జంట‌ ఫిబ్రవరి 21న గోవాలో రెండు రోజుల డెస్టినేష‌న్ పెళ్లి వేడుకలో ఒక‌టి కానున్నారు

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:11 AM GMT
పెళ్లికి ముందు ర‌కుల్ చేసిన ఈ ప‌ని చూశారా?
X

అందాల‌ రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని జంట‌ ఫిబ్రవరి 21న గోవాలో రెండు రోజుల డెస్టినేష‌న్ పెళ్లి వేడుకలో ఒక‌టి కానున్నారు. వాస్తవానికి విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేసిన ఈ జంట, భారతదేశంలోనే పెళ్లాడాల‌ని చివ‌రి నిమిషంలో ప్లాన్ ని మార్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'స్వ‌దేశీ పిలుపు'తో చివరి నిమిషంలో కొత్త‌ నిర్ణయం తీసుకున్నారు. రకుల్ - జాకీ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు పెళ్లితో ఒక‌ట‌వుతున్నారు. ఊహాగానాలకు విరుద్ధంగా రకుల్- జాకీ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో మాత్రమే వివాహాన్ని జరుపుకుంటారని క‌థ‌నాలొస్తున్నాయి. అంతేకాదు.. ముంబైలో లేదా మరెక్కడా వేడుకలు లేదా రిసెప్షన్‌లు ఉండవు. సాధారణంగా చాలా వివాహాల మాదిరిగానే ఇది 3-4 రోజుల వ్యవహారంగా సాగ‌నుంద‌ని తెలిసింది.


నిజానికి రకుల్ - జాకీ మొదట తమ వివాహాన్ని మిడిల్ ఈస్ట్‌లో ప్లాన్ చేసారు. దాదాపు ఆరు నెలల పాటు ప్లానింగ్ బాగానే సాగినా.. డిసెంబర్‌లో మాల్దీవుల‌తో ఇష్యూస్ అనంత‌రం భారత ప్రధాని పిలుపు మేరకు, ధనిక ప్రభావవంతమైన కుటుంబాలు తమ జీవితంలో పెద్ద వేడుక‌ల‌కు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని కోరడంతో రకుల్ -జాకీ తమ వాస్త‌వ‌ ప్రణాళికలను పునఃపరిశీలించి, వివాహా వెన్యూని భారతదేశానికి మార్చారు. డిసెంబరు మధ్యలో వారి నిర్ణ‌యం మారింది. దేశంపై ప్రేమతో వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలనే కోరికతో ఈ జంట భార‌త‌దేశ సమగ్రతకు స‌హ‌కారంగా నిర్ణ‌యం మార్చుకున్నారు.

ర‌కుల్ ప్రీత్ పెళ్లికి సిద్ధమ‌వుతున్న వేళ లేటెస్ట్ గా త‌న‌ ఫోటోషూట్లు అభిమానుల్లో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా ర‌కుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. మాజీ మిస్సు, స్టార్ హీరోయిన్ ర‌కుల్ 33 ఏజ్ లోను ఎంతో బ్యూటిఫుల్ గా టీనేజీ లుక్ తో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిన ర‌కుల్ థై స్లిట్ బ్లాక్ డిజైన‌ర్ గౌన్ లో ఏంజెల్ ని త‌ల‌పిస్తోంది.ఈ ఫోటోషూట్ కి బ్లాక్ ఈజ్ మిస్ట‌రీ అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది. 'నలుపు అనేది మిస్టరీ' అని బ్లాక్ ల‌వ్ ఈమోజీని షేర్ చేసింది. ఈ బ్లాక్ మిస్ట‌రీ గౌన్ కి త‌గ్గ‌ట్టుగానే త‌న అంద‌మైన మెడ‌లో వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ నెక్లెస్ ని ధ‌రించింది. ర‌కుల్ కొత్త లుక్ పై త‌న స్నేహితురాలు ప్ర‌గ్య జైశ్వాల్ ప్ర‌శంస‌లు కురిపించింది. అభిమానులు ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.