స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్ నువ్వమ్మా!
ఓవైపు రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లాడేందుకు రెడీ అవుతోంది
By: Tupaki Desk | 9 Feb 2024 5:07 PM GMTఓవైపు రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. మరోవైపు కాస్మోపాలిటన్ కవర్ పేజీ కోసం వైరల్ ఫోటోషూట్ తోను ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. రకుల్ లోని ఈ విలక్షణతే కుర్రాళ్లను ఎప్పుడూ యంగేజ్ చేస్తుంటుంది. అప్పటికప్పుడు బొద్దుగా కనిపించే రకుల్ ఉన్నట్టుండి ఇటీవల పెళ్లికి ముందు బాగా స్లిమ్ అయిపోయి కనిపిస్తోంది. ఇప్పుడు జెన్ జెడ్ ఫార్ములా ప్రకారం.. రకుల్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఇక రకుల్- జాకీ భగ్నానీ జంట పెళ్లి, ఆ తర్వాత అందమైన జీవితం గురించి కలలు ఇవన్నీ యూత్ లో చర్చగా మారాయి.
తాజాగా కాస్మోపాలిటన్ కవర్ పేజీపై రకుల్ ప్రీత్ ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోషూట్ లో డార్క్ బ్లూ మెస్సీ ఫ్రాక్ తో రకుల్ ఫోజులు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తన పొడవాటి ముఖాకృతికి తగ్గట్టుగా బాబ్డ్ హెయిర్ కట్ .. దానికి కాంబినేషన్ గా మెస్సీ డిజైనర్ డ్రెస్ ఎంతో యాప్ట్ గా కుదిరాయని చెప్పాలి. రకుల్ పూర్తి ఫిట్ లుక్ తో సన్నజాజి తీగను తలపిస్తోంది. దానికి తగ్గట్టే రకరకాల భంగిమలతో మత్తు చల్లిందనడంలో సందేహం లేదు. స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్ నువ్వమ్మా! అంటూ ఒక అభిమాని కాస్త పోయెటిక్ గానే స్పందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
పెళ్లికి డిజైనర్లు వీళ్లే:
నటి రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నాని గోవాలోని సుందరమైన బీచ్ డెస్టినేషన్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ స్పెషల్ డేపై ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. ముఖ్యంగా రకుల్-జాకీ జంట వివాహ దుస్తుల ఎంపిక ఎలా ఉంటుందోనన్న చర్చా సాగుతోంది. వీరిద్దరూ తమ వివాహ వేడుకల మూడు రోజుల పాటు వస్త్రధారణ కోసం ముగ్గురు డిజైనర్లను షార్ట్‌లిస్ట్ చేశారని తెలుస్తోంది.
జాకీ -రకుల్ అన్ని ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటున్నారు. దీనికోసం సభ్యసాచి సృష్టిలోని డిజైనర్ లుక్ ని, మనీష్ మల్హోత్రా టైమ్‌లెస్ డిజైన్ .. లేదా అద్భుతమైన తరుణ్ తహిలియానీ నుంచి మిశ్రమమైన సొగసు.. వీటిలో వేటిని ఎంపిక చేస్తారు? అన్నది వేచి చూడాలి. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని వధూవరులు ఖరారు చేస్తారని తెలుస్తోంది.