ఇది నాకు ఓ గుణపాఠం : రకుల్ ప్రీత్
ఆమె బరువు ఎక్కువ పట్టడం వల్ల, ఆ సమయంలో బెల్ట్ ధరించకపోవడం వల్ల ఆమె వెన్నుపై తీవ్ర ప్రభావం పడిందట.
By: Tupaki Desk | 17 Oct 2024 7:26 AM GMTహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వర్కౌట్స్ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురి అయింది. 80 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసే సమయంలో నడుముకు పెట్టుకోవాల్సిన బెల్ట్ పెట్టుకోలేదు. వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలిగింది.. కానీ ఆ తర్వాత నుంచి ఆమెకు విపరీతమైన నడుము నొప్పి ప్రారంభం అయింది. ఆమె బరువు ఎక్కువ పట్టడం వల్ల, ఆ సమయంలో బెల్ట్ ధరించకపోవడం వల్ల ఆమె వెన్నుపై తీవ్ర ప్రభావం పడిందట. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఆరు రోజుల చికిత్స తరువాత డిశ్చార్జ్ అయినట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.
తన గాయం గురించి, తాను చేసిన తప్పు గురించి సోషల్ మీడియా ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది. వర్కౌట్స్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించడం తప్పని సరి. ఆ విషయం నాకు తెలిసి నేను జాగ్రత్తగా లేను. నేను చేసింది కచ్చితంగా తప్పే అని ఒప్పుకుంటున్నాను. కేవలం అజాగ్రత్త మాత్రమే కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సైతం తాను ఈ ప్రమాదంకు గురి అయినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ఆరు రోజుల పాటు తాను పూర్తిగా మంచానికే పరిమితం అయ్యానంది. నేను తిరిగి మాములుగా నడవడం, ఇతర పనులు చేయడానికి మరో వారం నుంచి రెండు వారాలు పడుతుందని వైధ్యులు అంటున్నారు. తప్పకుండా నేను త్వరగా కోలుకుంటాను అంది.
వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఇష్టానుసారంగా చేయకుండా, ట్రైనర్ పక్కన ఉండటంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గాయం తనకు పెద్ద గుణ పాఠం. మరెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంది. అంతే కాకుండా జిమ్ లో వర్కౌట్స్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సైతం రకుల్ ప్రీత్ సింగ్ సూచించింది. వారం పది రోజుల్లో తాను మళ్లీ షూటింగ్ కు హాజరు అవుతాను అన్నట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే తిరిగి మామూలు మనిషిని అవుతాను అనే నమ్మకంను ఆమె వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. తమిళంలో ఈమె ఒకటి రెండు సినిమాలు చేసినా అవి హిట్ కాకపోవడంతో అక్కడ సైతం ఈమెకు ఆఫర్లు రావడం లేదు. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ తిరిగి హిందీలో ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటే అప్పుడు బాలీవుడ్‌లోనూ ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.