Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అంబానీ వారి ఇంట పెళ్లికి రకుల్‌ ఇలా..!

అంబానీ వారి ఇంట జరిగిన పెళ్లి వేడుకలో భర్త జాకీ భగ్నానీ తో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాజరు అయ్యింది. ఆ సమయంలో ఇద్దరు మ్యాచింగ్‌ వైట్ క్రీమ్ కలర్ డిజైనర్‌ డ్రెస్‌ లను ధరించారు.

By:  Tupaki Desk   |   15 July 2024 2:21 PM GMT
పిక్ టాక్‌ : అంబానీ వారి ఇంట పెళ్లికి రకుల్‌ ఇలా..!
X

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌ లో ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈ మధ్య కాలంలో డల్‌ అయ్యింది.

కోలీవుడ్ మరియు బాలీవుడ్‌ నుంచి కూడా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చేసేది ఏమీ లేక పెళ్లికి సిద్దం అయ్యింది. పెళ్లి తర్వాత అయినా తన ఫేట్ మారుతుందేమో అని ప్రయత్నాలు చేస్తుంది. సినిమాలు, సిరీస్ లు ఇలా అన్నింటిని చేసేందుకు సిద్ధం అన్నట్లుగా సన్నిహితులతో దర్శక నిర్మాతలకు మెసేజ్ లు పంపిస్తోందట.

సినిమాల్లో సందడి చేయకున్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్‌ గా అందాల రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఆకట్టుకునే ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇటీవల మరోసారి తన అందమైన ఫోటో షూట్‌ తో చూపరుల దృష్టిని ఆకర్షించింది.

అంబానీ వారి ఇంట జరిగిన పెళ్లి వేడుకలో భర్త జాకీ భగ్నానీ తో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాజరు అయ్యింది. ఆ సమయంలో ఇద్దరు మ్యాచింగ్‌ వైట్ క్రీమ్ కలర్ డిజైనర్‌ డ్రెస్‌ లను ధరించారు. రకుల్‌ హెయిర్ స్టైల్‌ స్వీట్‌ అండ్ సింపుల్ గా ఉండటంతో పాటు, మెడలో చౌకర్‌ కూడా ఆమె అందాన్ని మరింతగా పెంచింది.

సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొద్ది మందికి మాత్రమే అంబానీ వారి ఇంట పెళ్లికి ఆహ్వానం అందింది. అందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఉండటం గొప్ప విషయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ అందానికి మరో పదేళ్ల పాటు హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేసే సత్తా ఉంది. కనుక ఆమె మళ్లీ బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.