Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో డ్రగ్స్ కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్!

By:  Tupaki Desk   |   15 July 2024 11:15 AM GMT
హైదరాబాద్‌ లో డ్రగ్స్ కలకలం.. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్!
X

నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌.. డ్రగ్స్‌ కేసులో అరెస్టయ్యారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ముంబై నుంచి హైదరాబాద్‌ కు వచ్చిన ఒక గ్యాంగ్‌ ను తనిఖీ చేశారు.

అవును.. హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ పట్టుబడినట్లు వెలుగులోకి వచ్చిన దాదాపు ప్రతీ సంఘటన్లోనూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారి పేరు ఒక్కటైనా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో... ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టాడు.

సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందండంతో రంగంలోకి దిగిన పోలీసులు... మొత్తం ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఆ సందర్భంలో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

ఇలా పట్టుబడ్డ ఐదుగురిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ ఉండటం సంచలనం రేపింది. ఇక మిగిలిన నలుగురు కూడా సినీ, రాజకీయ ప్రముఖులని తెలుస్తోంది. దీంతో... ఒక్కసారిగా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. మరోసారి డ్రగ్స్ వ్యవహారంలో ఇండస్ట్రీ జనాల పాత్రపై చర్చలు మొదలయ్యాయి.

కాగా... డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారం రావడంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో... పట్టుబడ్డ వారి దగ్గరి నుంచి 200 గ్రాములకు పైగా కొకైన్‌ ను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ నైజీరియన్లు పలువురు వీఐపీలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.