కొత్తగా పెళ్లైందనే రకుల్ కి ఛాన్స్ ఇచ్చారా?
ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ మధుర గడియాల్ని అమ్మడు ఆస్వాదిస్తోంది
By: Tupaki Desk | 4 March 2024 5:30 PM GMTఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ మధుర గడియాల్ని అమ్మడు ఆస్వాదిస్తోంది. జాకీతో కొత్త జీవితాన్ని సంతోషంగా పంచుకుంటుంది. ఇంకొన్ని రోజుల పాటు తిరిగి షూట్ లో పాల్గొనే అవకాశం లేదు. కానీ తిరిగొచ్చే సరికి అమ్మడికి బాలీవుడ్ మాత్రం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతుంది? అన్న సంగతి అర్దమవుతుంది. అవును రకుల్ కోసం ఓచిత్ర యూనిట్ వెయిటింగ్ అంటోంది.
ఆ సీక్వెల్ లో రకుల్ ప్రీత్ సింగ్ ని తప్ప మరొకర్ని తీసుకునే ఛాన్స్ లేదని సర్ ప్రైజ్ ఇవ్వడానికి టీమ్ రెడీ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. అజయ్ దేవగణ్..టబు..రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన `దేదే ప్యార్ దే` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. వయసులో తనకంటే చిన్నదైన అయేషా అనే అమ్మాయిని 50 ఏళ్ల వయసున్న అశిష్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలనే భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే `దేదే ప్యార్ దే`.
ఈ సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఇదే టీమ్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అన్షుల్ శర్మ. దేదే ప్యార్ దే-2 టైటిల్ తో ఈ సినిమా పట్టాలెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడు. ఈ సీక్వెల్ లో అశిష్-అయేషాల మధ్య ప్రేమాయణం మరింత భిన్నంగా ఉంటుందని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ ని ఓ నాయికగా ఖరారు చేసారు. సీక్వెల్ లో రకుల్ పాత్ర మరింత ఎంగేజింగ్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
అయితే రకుల్ ని ఎంపిక చేయడానికి మరో కారణం కూడా ఉందని వినిపిస్తుంది. సినిమాలో పాత్ర పరంగానూ కొత్తగా పెళ్లైన హీరోయిన్ అయితే పాత్రకు పక్కాగానూ యాప్ట్ అవుతుందని దర్శకుడు భావి స్తున్నారుట. భార్యభర్తలకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు రకుల్ పాత్రకు అవసరం పడుతు న్నాయట. రకుల్ ఎంపికకు ఆమె కొత్తగా పెళ్లి చేసుకోవడం కూడా ఓ కీలక కారణంగానూ వినిపిస్తుంది. మరి ఆ కారణం ఏంటి? అన్నది దర్శకుడు వెండి తెరపై ఎలా చూపిస్తాడు? అన్నది చూడాలి.