Begin typing your search above and press return to search.

త‌మ్ముడి అరెస్ట్ వార్త‌లు లైట్ తీస్కున్న ర‌కుల్

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2024 2:47 PM GMT
త‌మ్ముడి అరెస్ట్ వార్త‌లు లైట్ తీస్కున్న ర‌కుల్
X

జాతీయ మీడియాలు మొద‌లు హైద‌రాబాద్ మీడియా వ‌ర‌కూ అన్నిచోట్లా ఈరోజు ఒక‌టే సంచ‌ల‌న‌ వార్త‌. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ ప్రీత్ సింగ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట‌య్యారు అనేది ఆ వార్త సారాంశం! అయితే ఈ వార్త‌ల్ని అస‌లు ర‌కుల్ ప్రీత్ సింగ్ ప‌ట్టించుకున్న‌ట్టే క‌నిపించ‌లేదు. తాజాగా ర‌కుల్ షేర్ చేసిన స్పెష‌ల్ ఫోటోషూట్ చాలా ప్ర‌శ్న‌ల‌కు, సందేహాల‌కు స‌మాధానంగా నిలిచింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న భ‌ర్త జాకీ భ‌గ్నానీతో రొమాంటిక్ గా ఫోజులిచ్చిన కొన్ని ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ పెళ్లి వేడుక‌ల్లో షూట్ చేసిన‌ది. ఇది ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన వేడుక నుంచి ఫోటోషూట్.

ఈ ఫోటోషూట్ కి ర‌కుల్ ఒక అంద‌మైన క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ''ఈ అందమైన ప్రపంచంలో నువ్వు - నేను'' అంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసింది. ఈ అందమైన ప్రయాణంలో #అనంత్ అంబానీ - రాధిక మ‌ర్చంట్.. మీకు అభినందనలు !! మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది.. మీరు ప్రపంచంలోని అన్ని సంతోషాలతో ఆశీర్వదించబడాలి'' అని రాసారు. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. నార్కోటిక్స్‌ బ్యూరో, రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌ అనంతరం అతడిని అరెస్టు చేశార‌ని ఇది సైబరాబాద్ పోలీసు పరిధిలో జరిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

జూలై 15, సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ విక్ర‌యిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా అందులో నైజీరియ‌న్లతో పాటు స్థానిక పెడ్ల‌ర్లు ఉన్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. అయితే డ్రగ్స్ సేవించినందుకు (కొకైన్ సేవ‌నం) పరీక్ష‌ల్లో పాజిటివ్ వ‌చ్చాక‌ అరెస్టయిన 13 మందిలో అమన్ ప్రీత్ అనే న‌టుడు కూడా ఉన్నాడని పోలీసులు వెల్ల‌డించారు. త్వరలోనే వీరంద‌రినీ కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

అయితే ఈ కేసులో స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు ఉన్న‌ట్టు పోలీసులు ధృవీక‌రించ‌లేదు. అమ‌న్ ప్రీత్ అనే వ్య‌క్తి తాను న‌టుడిని అని మాత్రం చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు. అత‌డు టాలీవుడ్ న‌టుడా లేక ఇంకెక్క‌డైనా న‌టిస్తాడా? అన్న‌ది అత‌డు చెప్ప‌లేద‌ని కూడా పోలీసులు అన్నారు. అమన్ ఎవరితో సంబంధం కలిగి ఉన్నారో మాకు ఇంకా తెలీదు. నైజీరియన్లతో కూడిన నిందితులతో అతని అనుబంధం ఎప్పుడు మొదలైందో మేం ఇంకా తనిఖీ చేయాలి. వారిలో కొందరు పునరావృత నేరాలకు పాల్పడుతున్నారు. కానీ అది ఏడాదిన్నర పాటు ఉండవచ్చని మేము నమ్ముతున్నాము. కొకైన్ వాడినందుకు అమన్ పాజిటివ్ అని తేలింది. అతను నటుడని ధృవీకరించారు అని తెలిపారు. అయితే ఇంత‌లోనే అమ‌న్ ప్రీత్ .. ర‌కుల్ ప్రీత్ సోద‌రుడు అంటూ మీడియాలో సంచ‌ల‌న వార్త‌లు వ‌చ్చాయి.

తెలంగాణలో సిక్ ఎకోసిస్టమ్ డ్రగ్స్‌ను ప్రమోట్ చేస్తున్న సంపన్నులైన హైదరాబాద్‌కు చెందిన 13 మంది వినియోగదారులను పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌ను సృష్టిస్తున్నారు. అయితే ఈ 13 మంది వినియోగదారులలో, ఆరుగురు పట్టుబడ్డారు. మొత్తం ఆరుగురి మూత్ర నమూనాలను పరీక్షించినప్పుడు కొకైన్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి అని పోలీసులు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. 13 మంది వినియోగదారుల్లో అమన్, కిషన్ రాఠి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణం రాజు, వెంకట్‌లుగా గుర్తించారు.

ఈ కేసులో 199 గ్రాముల కొకైన్‌, 2 పాస్‌పోర్టులు, 2 బైక్‌లు, 10 సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు ఓనుఓహా బ్లెస్సింగ్, అజీజ్ నోహామ్ అడెషోలా, అల్లం సత్య వెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లుగా గుర్తించారు. పెడ్ల‌ర్ల‌లో డివైన్ ఎబుకా సుజీ, ఎజియోనిలీ ఫ్రాంక్లిన్ ఉచెన్నా తప్పించుకున్నార‌ని పోలీసులు తెలిపారు.