పెళ్లి ఎప్పుడు... ఎన్ని సార్లు పెళ్లి చేసుకోవాలి?
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో ఒకానొక సమయంలో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.
By: Tupaki Desk | 4 July 2024 7:51 AM GMTటాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో ఒకానొక సమయంలో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమాకే డేట్లు లేవు అంటూ చెప్పేంత బిజీగా గతంలో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేకపోవడంతో దిక్కులు చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితి.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్న ఒకేఒక్క సినిమా ఇండియన్ 2. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన చిన్న పాత్రలో నటించినట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా కూడా ఇండియన్ 2 గురించిన విషయాలను పంచుకుంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ సమయంలోనే ఒక వ్యక్తి మేడమ్ పెళ్లి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు రకుల్ ఫన్నీగా స్పందిస్తూ.. ఎన్ని సార్లు పెళ్లి చేసుకోవాలి అంటూ ఎదురు ప్రశ్నించింది.
జాకీ భగ్నానీ ని రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే వివాహం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చాలా వైభవంగా జరిగింది. వారం పది రోజుల పాటు సోషల్ మీడియాలో రకుల్, జాకీ భగ్నానీల పెళ్లి వీడియోలు మరియు ఫోటోలు సందడి చేశాయి. అంతగా హడావుడి చేసినా కూడా ఆ వ్యక్తి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగిన విషయం గుర్తించలేదో, మరి మర్చి పోయాడో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.