Begin typing your search above and press return to search.

లెగ్స్ అందాలతో రకుల్ స్టన్నింగ్ లుక్

తెలుగు, తమిళ్ భాషలలో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:36 AM GMT
లెగ్స్ అందాలతో రకుల్ స్టన్నింగ్ లుక్
X

కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ అడుగుపెట్టిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో రకుల్ కి మొదటి హిట్ పడింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా తెలుగులో ఆఫర్స్ ని ఈ పంజాబీ బ్యూటీ అందుకుంది. తెలుగు, తమిళ్ భాషలలో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.


అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టింది. అలాగే రారండోయ్ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మన్మథుడు 2లో కింగ్ నాగార్జునతో నటించింది. చివరిగా ఆమె తెలుగులో కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా చేసింది. అంతకంటే ముందుగానే బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాలు పెంచుకుంది.


తరువాత హిందీలో వరుస ఛాన్స్ లు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి ఆల్ మోస్ట్ దూరం అయ్యింది. తెలుగు ఆఫర్స్ వస్తున్న కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకుంటుందని తెలుస్తోంది. ఈ బ్యూటీ హిందీలో నిర్మాత, యాక్టర్ అయిన జాకీ భగ్నానితో చాలా కాలంలో రిలేషన్ లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిగా కెరియర్ కొనసాగిస్తోంది.


ఈ ఏడాది ఇండియన్ 2తో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. హిందీలో దే దే ప్యార్ దే 2, మేరీ పత్ని కా రీమేక్ సినిమాలలో ప్రస్తుతం నటిస్తోంది. ఇదిలా ఉంటే ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోషూట్ లని షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి 23.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


అందుకే ఈమె పెట్టే ప్రతి పోస్ట్ కి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ తెరవెనుక అంటూ ఈ షూట్ లో మ్యాకప్ వేసుకుంటున్న ఫోటోల ని షేర్ చేసింది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి చాలా గ్లామరస్ గా ఈ పిక్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోంది. ఈ ఫోటోలని ఏకంగా 1.86 లక్షల మంది లైక్ చేశారు. ఈ పిక్స్ చూసిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ లో అందం రోజు రోజుకి పెరిగిపోతుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు తెరపై మళ్ళీ రకుల్ ని చూడాలని అనుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.