Begin typing your search above and press return to search.

రకుల్ స్టన్నింగ్ షో.. చూపులతో మైండ్ బ్లాక్!

డిఫరెంట్​ మోడ్రన్​ ఔట్​ ఫిట్లు ధరించిన ఈ భామ.. ప్రస్తుతం నాలుగు రకాలు ఫొటోషూట్​లు చేసింది. మొదటి దాంట్లో బ్లూ కలర్​ నెటెడ్​​ డ్రెస్​లో వైట్ బ్రా చూపిస్తూ ఓపెన్​ హార్ట్ షో చేసింది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:15 PM GMT
రకుల్ స్టన్నింగ్ షో.. చూపులతో మైండ్ బ్లాక్!
X

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. 2009లో గిల్లి అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కెరటం అనే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం తక్కువ కాలంలోనే.. తమిళ, హిందీ ఇండస్ట్రీలోనూ తన అందం, అభినయంతో ఫుల్ క్రేజ్​ సంపాదించుకుని స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. తాజాగా ఈ భామ కన్నుల విందు చేసేలా కిరాక్​ ఫొటోషూట్​ చేసింది.


వివరాళ్లోకి వెళితే..తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్​, కరెంట్​ తీగ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నా ఈ భామ ఆ తర్వాత రఫ్, లౌక్యం, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా వంటి చిత్రాల్లోనూ నటించి ఆడియెన్స్​ను ఆకట్టుకుంది.

ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత​ విషయాలతో పాటు ఫొటోషూట్లతో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ నాజూకు బ్యూటీ.. గ్రేజియా మ్యాగ్జైన్​ కోసం తమ పరువాలను కవర్​ పేజ్​పై ఆరబోసింది.

డిఫరెంట్​ మోడ్రన్​ ఔట్​ ఫిట్లు ధరించిన ఈ భామ.. ప్రస్తుతం నాలుగు రకాలు ఫొటోషూట్​లు చేసింది. మొదటి దాంట్లో బ్లూ కలర్​ నెటెడ్​​ డ్రెస్​లో వైట్ బ్రా చూపిస్తూ ఓపెన్​ హార్ట్ షో చేసింది. మరో ఫొటోలో ఎల్లో కలర్​ స్లీవ్​ లెస్​ డ్రెస్​లో, ఇంకో పిక్​లో మల్టీ కలర్​ టూబ్ డ్రెస్​లో, మరో దాంట్లో గ్రేస్​ ఫుల్​గా గ్రీన్​ కలర్ డ్రెస్​లో తన ఫ్యాషన్​ సెన్స్​ను బాగా చూపించింది.

వీటిన్నింటిలోనూ ఈ ముద్దుగుమ్మ ఎద అందాలతో క్లీవేజ్ షో చేసింది. చురకత్తులాంటి చూపులతో గాలం వేసింది. గోల్డెన్ ఇయర్​ రింగ్​, బ్రాస్​లెట్​, స్టైలిష్​ చెప్పులు, హెయిల్​ లుక్​తో ఛార్మింగ్​గా కనిపించింది. దీంతో ఈ పిక్స్​ను నెటిజన్లు బాగా షేర్​ చేస్తూ రకుల్ అందాలను ఆస్వాదిస్తూ చిల్ కొడుతున్నారు.