Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల రకుల్‌ బ్లూ బికినీ షో

ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   21 May 2024 9:20 AM GMT
పిక్ టాక్ : అందాల రకుల్‌ బ్లూ బికినీ షో
X

కన్నడ చిత్రం గిల్లి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగు లో ఈ అమ్మడు కెరటం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టిన సినిమా మాత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌. ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ లతో పాటు ఇంకా పలువురు ఇతర భాషల స్టార్స్ తో కూడా సినిమాలు చేసి సౌత్ స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. బాలీవుడ్‌ లో కూడా ఈమె సందడి కొనసాగింది.

ఈ మధ్య కాలంలో కాస్త ఆఫర్లు తగ్గినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె జోరు కంటిన్యూ అవుతుంది. ఓ రేంజ్ అందాల ఆరబోత చేస్తూ ఫోటోలకు ఫోజ్ లు ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అందాల సముద్రపు అందం మధ్య రకుల్‌ ప్రీత్‌ సింగ్ బ్లూ బికినీ లో అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తూ చూపరులను ఆకర్షిస్తుంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యింది. అలాగే రకుల్‌ కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకే చెప్పడం ద్వారా ఇండస్ట్రీలో బిజీ అయితే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో మాత్రం అందాల షో ఓ రేంజ్ లో చేస్తుంది.