రకుల్ ముఖం కళ తప్పిందేమిటీ?
బాగా అలసిపోయినట్టు... ఏదో వెలితిగా కనిపిస్తోందేమిటి రకుల్ ప్రీత్?! ఇదిగో ఇక్కడ ఈవెంట్లో వీడియో చూశాక అభిమానుల సందేహాలు ఇవి
By: Tupaki Desk | 2 Jun 2024 7:49 AM GMTబాగా అలసిపోయినట్టు... ఏదో వెలితిగా కనిపిస్తోందేమిటి రకుల్ ప్రీత్?! ఇదిగో ఇక్కడ ఈవెంట్లో వీడియో చూశాక అభిమానుల సందేహాలు ఇవి. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా కనిపించిన రకుల్ ఇటీవల జీరో సైజ్ కి మారింది. ఆ తర్వాతే చిక్కులు మొదలయ్యాయ. అసలింతకీ రకుల్ జీవన శైలిలో మార్పులు తన రూపాన్ని డ్యామేజ్ చేస్తున్నాయా? అంటే .. ఏమో.. అభిమానుల్లో సవాలక్ష సందేహాలు!!
ఇటీవల సౌత్ లో అవకాశాల్లేవ్.. నార్త్ లోను నిర్మాత అయిన తన భర్త తీసే సినిమాల్లోనే ఛాన్సులొస్తున్నాయ్. దీంతో రకుల్ ఫోకస్ వేరే వైపు కనిపిస్తోంది. చాలావరకూ సంపాదనను వేరే వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈ వ్యాపారాలు ఎలా ఉన్నా కానీ, తనకి స్ట్రెస్ పెరిగిందని అర్థమవుతోంది. ఇదిగో నిన్న సాయంత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2) ఈవెంట్ లో ఇలా ఫుల్ టైర్డ్ గా కనిపించింది.
ఇండియన్ 2 ఆడియో లాంచ్ కోసం ఎంపిక చేసుకున్న డిజైనర్ డ్రెస్ అంతంత మాత్రమే. ఇది మెరుపుల బ్లాక్ చీర.. బోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్.. కానీ రకుల్ లో ఏదో కళ తప్పినట్టే అనిపించింది. వీక్ గా మారిన రకుల్ కళ్లలో మెరుపుల్లేవ్.. ముఖంలో గ్లో అసలే లేదు. పూర్తిగా కళ తప్పిందంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. మరి దీనికి సమాధానమిచ్చేలా ఎప్పటికి మారుతుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్!