Begin typing your search above and press return to search.

వావ్.. రకుల్ సో గ్లోరియస్.. అవార్డు కూడా!

రీసెంట్ గా నెక్సా అవార్డు అందుకుంది అమ్మడు. గత ఏడాది ఆమె నటించిన ఛత్రీవాలి సినిమాకు గాను అవార్డు గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   22 July 2024 10:25 AM GMT
వావ్.. రకుల్ సో గ్లోరియస్.. అవార్డు కూడా!
X

కెరటం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సూపర్ హిట్ అందుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కమర్షియల్ హిట్స్ సాధించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో బాలీవుడ్ ఆఫర్స్ రావడంతో అక్కడికి చెక్కేసింది అమ్మడు.


కొండపొలం చిత్రం తర్వాత ఒక్క తెలుగు మూవీలో కూడా నటించని రకుల్.. మంచి స్టోరీ దొరికితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియన్-2 మూవీలో నటించి ఫ్లాప్ మూటగట్టుకుంది. అంతే కాదు సీక్వెల్ లో ఆమె నటిస్తే.. సినిమా ఫ్లాప్ అయిపోతుందన్న అపవాదు అందుకుంది! అయితే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్ హిట్స్ అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతోంది రకుల్ ప్రీత్ సింగ్.


రీసెంట్ గా నెక్సా అవార్డు అందుకుంది అమ్మడు. గత ఏడాది ఆమె నటించిన ఛత్రీవాలి సినిమాకు గాను అవార్డు గెలుచుకుంది. ఆ అవార్డు పట్టుకుని పిక్స్ దిగి షేర్ చేసింది రకుల్. ఇక స్టైల్ విషయంలో ఏ మాత్రం తగ్గిన అమ్మడు.. నెక్సా అవార్డు ఫంక్షన్ కు ఆరెంజ్ కలర్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో వెళ్లింది. థై స్లిట్ గౌనులో ఈవెంట్ కు వెళ్లిన అమ్మడు.. అక్కడ ఉన్న వారందరినీ ఫిదా చేసింది. అదే సమయంలో ఫోటో షూట్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


స్టైలిష్ డ్రెస్ లో అదిరిపోయే పోజులిచ్చింది రకుల్. ఔట్ ఫిట్ కు తగ్గట్టు ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. సింపుల్ గా ఒక్క బ్రాస్లెట్ మాత్రమే ధరించి అందంగా కనిపించింది. గ్లోయింగ్ స్కిన్, థై షోతో ఫిదా చేస్తోంది. ఓ రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. కొంటెగా చూస్తూ మాయ చేస్తోంది. క్యూట్ గా నవ్వుతూనే సెగలు రేపుతోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కొత్త పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


డ్రెస్ కన్న రకుల్ స్టిల్స్ కేక అని నెటిజన్లు చెబుతున్నారు. ఏ డ్రెస్ లో అయినా అమ్మడు అందమేనని అంటున్నారు. చూపులతో మైండ్ బ్లాక్ చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. సింపుల్ అండ్ షైనీ బ్యూటీ అంటూ పొగిడేస్తున్నారు. అమ్మడిని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తున్నారు. అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తూ లైకులు కొడుతున్నారు. మరి రకుల్ కు అవార్డు వచ్చేలా చేసిన ఛత్రీవాలి సినిమా జీ ఫైవ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఆ మూవీని చూశారా?