Begin typing your search above and press return to search.

నిక్క‌రు బ్యూటీలో ర‌కుల్ రంజు రంజుగా!

ఇక కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్ ల‌కు వేటికైనా సైన్ చేసిందా? అన్న‌ది తెలియాలి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 2:37 PM GMT
నిక్క‌రు బ్యూటీలో ర‌కుల్ రంజు రంజుగా!
X

ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు అన్ని భాషల్ని దున్నేస్తుంది. జ‌యా పజ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటు వెళ్తోంది. గ‌తేడాది మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ అవేవి ర‌కుల్ ఖాతాలో విజ‌యవంత‌మైన చిత్రాలో ప‌డి నవి కాదు. ఇక కొత్త ఏడాదిని అమ్మ‌డు `ఆయ‌లాన్` తో లాంచ్ చేసింది. ఈ సినిమా డివైడ్ టాక్ తో బ‌య‌ట ప‌డింది.

ప్ర‌స్తుతం ఖాతాలో రెండు..మూడు చిత్రాలున్నాయి. అవి రెండు అధికార‌కంగా ప‌ట్టాలెక్కిన చిత్రాలు. ఇక కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్ ల‌కు వేటికైనా సైన్ చేసిందా? అన్న‌ది తెలియాలి. మరి మునుప‌టిలా కెరీర్ ఇప్పుడు 2024 లో ప‌రుగులెట్టిస్తుందా? న‌వ నాయిక‌ల పోటీని త‌ట్టుకుని ఛాన్సులు అందుకుంటుందా? అన్న‌ది చూడాలి. ఇలా ఇంత బిజీగా ఉన్న సోష‌ల్ మీడియాలో మాత్రం దూకుడు త‌గ్గ‌దు.

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌ను హీటెక్కిస్తూనే ఉంటుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో కొత్త ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా తెలుపు రంగు దుస్తుల్లో జివ్వుమ‌నిపిస్తుంది. తెలుపు రంగు నిక్క‌రు..బ్లౌజ్ లో అమ్మ‌డి స‌య్యాట మామూలుగా లేదు. అమ్మ‌డి పాల నురుగుల అందంలో త‌ళ‌త‌ళ‌లాడిపోతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి ఓ ఇంట్రెస్టింగ్ కొటేష‌న్ కూడా షేర్చేసింది.

'మ‌నం మ‌న‌లా..మ‌న‌కు న‌చ్చిన‌ట్లుగా ఉండ‌ట‌మే ఎంతో ఉత్త‌మ‌మైన‌ది` అంటూ వేద్దాంతం వ‌ల్లించే ప్ర‌య‌త్నం చేసింది. బ‌య‌ట‌కు ఒక‌లా... లోప‌ల మ‌రోలా ఉండ‌టం కంటే అన్ని వేళ‌లా ఎలాంటి క‌ల్మశం లేకుండా ఉండే ఓ చిరు ప్ర‌య‌త్నంగా ఇలా కొటేష‌న్ పాస్ చేసిన‌ట్లుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టిం వైర‌ల్ గా మారింది. ర‌కుల్ అభిమానులు అమ్మ‌డి బ్యూటీకి అంతే ఫిదా అవుతున్నారు.