Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెడ్‌ అందాల ముద్దుగుమ్మ

మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా 2013 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా ఆమె కెరీర్‌ కి టర్నింగ్‌ పాయింట్‌.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:46 AM GMT
పిక్ టాక్ : రెడ్‌ అందాల ముద్దుగుమ్మ
X

కన్నడ సినిమా గిల్లి తో 2009 లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడు తెలుగు లో 2011 సంవత్సరంలో కెరటం సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా 2013 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా ఆమె కెరీర్‌ కి టర్నింగ్‌ పాయింట్‌.


లౌక్యం, పండగ చేస్కో, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో, స్పైడర్‌ ఇలా వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో దాదాపు అయిదు ఆరు ఏళ్ల పాటు నటించిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు గత కొంత కాలంగా ఆఫర్లు చాలా తక్కువ అయ్యాయి. ఈ మధ్య కాలంలో రకుల్‌ సోషల్‌ మీడియాకే పరిమితం అయ్యింది.

సినిమాలు పెద్దగా చేయకున్నా కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌ లకు వస్తున్న రీచ్ ను బట్టి అర్థం అవుతుంది. హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకుని తీరుతుంది అంటూ ఇలాంటి ఫోటోలు షేర్ చేసిన సమయంలో నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా రెడ్‌ డ్రెస్ లో అందాల విందు చేస్తూ రకుల్‌ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్లోజప్‌ లో అందాల రకుల్‌ ఎద సౌందర్యంకు నెటిజన్స్ నోరు వెళ్లబెడుతున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సొంతం అంటూ ఈ ఫోటోలతో మళ్లీ నిరూపితం అయ్యింది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక హిందీ సినిమా మరియు ఒక తమిళ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు విజయాలను సొంతం చేసుకుంటే సౌత్ మరియు నార్త్‌ లో ఈ అమ్మడు బిజీ అయ్యేనా అనేది చూడాలి. టాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు మళ్లీ నటించాలని ఆశ పడుతుంది.