Begin typing your search above and press return to search.

వాటర్ బేబీ రకుల్.. బికినీలో స్టన్ అయ్యేలా..

ఇంత కూల్ క్లైమేట్ లో కూడా బీచ్ లో ఫుల్ చిల్ అవుతోంది. ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అమ్మడి ఫొటోలు చూస్తున్న నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 11:02 AM GMT
వాటర్ బేబీ రకుల్.. బికినీలో స్టన్ అయ్యేలా..
X

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మ‌డు.. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకానొక దశలో సక్సెస్ కోసం ఎదురుచూసిన రకుల్.. ఇప్పుడు అవ‌కాశాల‌తో సందడి చేస్తోంది.


కంటిన్యూగా సినిమాలు చేస్తున్నా.. తనకు వీలుదొరికినప్పుడల్లా వెకేషన్ కు వెళ్తుంటోంది ఈ బ్యూటీ. అక్కడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటోంది. తన ఒంపుసొంపులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని తన సౌందర్యాన్ని ప్రదర్శిస్తోంటోంది. తాజాగా కొత్త ఫొటోలను షేర్ చేసింది.


ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ అమ్మడు ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. డార్క్ పింక్ కలర్ స్విమ్ సూట్ లో దిగిన పిక్స్ ను షేర్ చేసింది. ఇంత కూల్ క్లైమేట్ లో కూడా బీచ్ లో ఫుల్ చిల్ అవుతోంది. ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అమ్మడి ఫొటోలు చూస్తున్న నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ట్రెండీ పిక్స్‌ కు రెండున్నర లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయంటే రకుల్‌ అందాలు ఎంత ఆకట్టుకున్నాయే అర్ధం చేసుకోవచ్చు.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగి నార్త్‌ కు షిప్ట్ అయిపోయింది రకుల్. అయితే ఆమె కెరీర్ ను సెట్ చేసి బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఈ సినిమా విజ‌యంతోనే రకుల్ తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది. ధృవ, కరెంట్ తీగ, లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమ, కిక్ 2, సరైనోడు లాంటి సినిమాలతో బిజీ అయింది.

ఆ తర్వాత బీ టౌన్కు షిప్ట్ అయిన ఈ చిన్నది అక్కడ కూడా మంచి ఆఫర్లను అందుకుని సందడి చేస్తోంది. ఇప్పుడు మళ్లీ ఈ బ్యుటీ సౌత్ లో సందడి చేస్తోంది. ఇండియన్-2, అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. స్టార్ హీరో కార్తీతో మరో సినిమా చేయనుంది. మరి ఈ బ్యూటీ కొత్త సినిమాలు హిట్ అవుతాయో లేదో చూడాలి.