తారక్ ను చూసి చరణ్ జలస్ గా ఫీల్ అయ్యాడా?
ఇప్పుడు దాన్ని అందరికీ తెలిసే విధంగా RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం విదితమే.
By: Tupaki Desk | 27 Dec 2024 5:29 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా.. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. ఎన్నో రికార్డులు అందుకుంది. మరెన్నో ఘనతలు సాధించింది. తెలుగు సినిమాను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.
ఆస్కార్ వరకు వెళ్లి నాటు నాటు సాంగ్ కు గాను అవార్డు సాధించి సరికొత్త రికార్డు సెట్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ. దీంతో రాజమౌళి, తారక్, చరణ్ క్రేజ్.. వేరే లెవెల్ లో పెరిగింది. పాన్ వరల్డ్ లెవెల్ లో అనేక మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. తమ అప్ కమింగ్ చిత్రాల వైపు అందరి దృష్టిని తిప్పుకున్నారు ముగ్గురు కూడా.
అయితే సినిమా కోసం తారక్, రామ్ చరణ్, జక్కన్న అండ్ టీం ఎంతో కష్టపడింది. ఇప్పుడు దాన్ని అందరికీ తెలిసే విధంగా RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం విదితమే. గంట 37 నిమిషాల రన్ టైంతో సాగే డాక్యుమెంటరీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజవ్వగా.. ఇప్పుడు ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
ఇక ఆర్ఆర్ఆర్ సమయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. మెయిన్ హీరో ఎవరు? సైడ్ హీరో ఎవరు? అన్నట్లు అనేక మంది నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక.. జక్కన్న ఇద్దరికీ సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అర్థమైంది. ఇప్పుడు డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చాక.. అది నిజమేనని తెలుస్తోంది.
సినిమా కోసం హీరోలిద్దరూ పడిన కష్టం, రాజమౌళి వివరించిన విధానం... డాక్యుమెంటరీలో చూశాక అదంతా వేస్ట్ డిస్కషన్ అని నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో తారక్ విషయంలో చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు చరణ్.
తారక్ ను చూసి చాలా జెలస్ ఫీలయ్యానని చరణ్ అన్నారు. కొమురం భీముడో పాటలో ఆయన్ను చూసినప్పుడు తనకు ఈర్ష్యగా అనిపించిందని తెలిపారు. ఆ పాటను చిత్రీకరించిన విధానం అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా తారక్ ఎక్స్ ప్రెషన్స్ ను బాగా పండించారని, మేకర్స్ కూడా అంతే రీతిలో షూట్ చేశారని తెలిపారు. మొత్తానికి తారక్ ను చూసి చరణ్ జస్ట్ జలస్ గా ఫీల్ అయ్యారన్నమాట.