ఇంటి పని వారితో చెర్రీ, ఉప్సీ.. సో గ్రేట్!
అంతా తమ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో జరుపుకుంటే.. చెర్రీ, ఉప్సీ మాత్రం తమ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందితో సెలబ్రేట్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 8:30 AM GMTవరల్డ్ వైడ్ గా అందరూ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. సామాన్యులు, ప్రముఖులు అలా అనేక మంది ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో తమ క్రిస్మస్ సెలబ్రేషన్ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల సెలబ్స్ పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతుల క్రిస్మస్ వేడుకలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి! అంతా తమ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో జరుపుకుంటే.. చెర్రీ, ఉప్సీ మాత్రం తమ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందితో సెలబ్రేట్ చేసుకున్నారు. తమ గొప్ప మనసును క్రిస్మస్ సందర్భంగా మరోసారి చాటుకున్నారు.
అందుకు సంబంధించిన పిక్స్ ను ఉపాసన.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో రోజూ మా కోసం చాలా అద్భుతంగా పని చేస్తున్న వారి పట్ల కృతజ్ఞత, ప్రేమ చూపించడానికి మేం కొంత సమయం కేటాయించాలనుకున్నాం" అంటూ రాసుకొచ్చారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలిపారు ఉపాసన.
అయితే గ్రూప్ పిక్ లో క్రిస్మస్ ట్రీ ముందు అంతా శాంటా క్లాజ్ క్యాప్స్ పట్టుకుని క్రేజీగా పోజ్ ఇచ్చారు. అంతా ఫుల్ ఖుషీ అయినట్లు పిక్ ద్వారా అర్థమవుతోంది. మరో ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార, రైమ్ (పెట్ డాగ్) ఉన్నాయి. ఆ సమయంలో క్లీంకార క్యూట్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకోగా.. వెనక్కి తిరిగి తన ఫాదర్ వద్ద నిల్చుంది.
మొత్తానికి ఈసారి కూడా క్లీంకార ఫేస్ రివీల్ కాలేదు. ఏదేమైనా ఉపాసన పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. చరణ్, ఉపాసనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంట్లో పని చేసే వారితో పండుగ సెలబ్రేట్ చేసుకోవడం గ్రేట్ అంటూ మెగా అభిమానులు కొనియాడుతున్నారు. పిక్స్ ను షేర్ చేస్తున్నారు.
అయితే క్రిస్మస్ కానుకగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. మరోవైపు, RC 16 షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు. మరి వరుస చిత్రాలతో ఎలాంటి విజయాలు అందుకుంటారో వేచి చూడాలి.