ఈ అప్పన్న చిట్టిబాబుని మించుతాడా..?
గేమ్ ఛేంజర్ లో అప్పన్న పాత్ర రంగస్థలం లో చిట్టి బాబు పాత్రని ఓవర్ టేక్ చేస్తుందా లేదా అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది.
By: Tupaki Desk | 3 Jan 2025 3:30 PM GMTశంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ గా రాబోతున్న రామ్ చరణ్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ టార్గెట్ తో వస్తున్నాడు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే వింటేజ్ శంకర్ ని చూసినట్టు ఉంది. తన సినిమాల్లో మంచి సోషల్ మెసేజ్ ని ఇస్తూ కావాల్సిన కమర్షియల్ హంగులతో డెకరేట్ చేస్తాడు శంకర్. అందుకే ఆయన సినిమాలకు కేవలం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఉంటారు. ఐతే 30 ఏళ్ల కెరీర్ లో గేమ్ ఛేంజర్ సినిమా తో స్ట్రైట్ తెలుగు సినిమా చేశారు శంకర్. ఈ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ స్టామినా చూపించబోతున్నారు.
ఐతే ఈ సినిమా లో రాం చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి ఐ.ఏ.ఎస్ రోల్ కాగా మరొకటి అప్పన్న పాత్ర. అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని తెలుస్తుంది. ఆ రోల్ సినిమాకు ఆయువు పట్టు లాంటిదని అంటున్నారు. అంతేకాదు ఆ పాత్రకు ఒక లోపం కూడా ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో చిట్టి బాబు పాత్రకి చెవుడు ఉంటుంది. మరి అప్పన్న పాత్రకు ఏం లోపం ఉందో తెలియదు కానీ సినిమాలో ఆ పాత్రలో చరణ్ అదరగొట్టాడని అందరు చెబుతున్నారు.
ఆ పాత్ర చూసే రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ కూడా వస్తుందని డల్లాస్ ఈవెంట్ లో సుకుమార్ చెప్పాడు. ఐతే రంగస్థలంలో చిట్టి బాబు పాత్ర పీక్స్ లో ఉంటుంది. అలా ఎవరు చేయలేరు అనే రేంజ్ లో చరణ్ మెప్పించాడు. ఇక ఇప్పుడు అప్పన్న పాత్ర కూడా అదే తరహాలో చాలా నావెలిస్టిక్ గా ఉంటుందట. గేమ్ ఛేంజర్ లో అప్పన్న పాత్ర రంగస్థలం లో చిట్టి బాబు పాత్రని ఓవర్ టేక్ చేస్తుందా లేదా అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది.
ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా మెగా ఫ్యాన్స్ కి మంచి ఊపు తెస్తుంది. సాంగ్స్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అంతా కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తుంది. మరి ఈ సినిమా తో రాం చరణ్ రికార్డుల సౌండ్ ఎలా ఉండబోతుందో చూడాలి.