Begin typing your search above and press return to search.

బాలయ్య, రామ్ చరణ్… దీని కోసమే కదా ఫ్యాన్స్ ఎదురుచూసేది!

ఈ నేపథ్యంలో ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’లో నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా పాల్గొంటాడనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 12:00 PM GMT
బాలయ్య, రామ్ చరణ్… దీని కోసమే కదా ఫ్యాన్స్ ఎదురుచూసేది!
X

నందమూరి బాలకృష్ణ ఆహాలో చేస్తోన్న ‘అన్ స్టాపబుల్ షో’ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ‘అన్ స్టాపబుల్ షో సీజన్ 4’ జోరుగా నడుస్తోంది. ఈ సీజన్ లో కూడా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విక్టరీ వెంకటేష్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇద్దరు సీనియర్ హీరోలు షోలు చేసిన సందడికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే ‘అన్ స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. 2025 సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. తాజాగా బాలయ్య హోస్ట్ గా విక్టరీ వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేసేసారు.

నెక్స్ట్ సంక్రాంతి రేసులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’లో నెక్స్ట్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా పాల్గొంటాడనే మాట వినిపిస్తోంది. దీనికి సంబందించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయంట. ఈ సీజన్ లి రామ్ చరణ్ తో ఎపిసోడ్ కచ్చితంగా ఒక స్పెషల్ గా ఉంటుందని భావిస్తున్నారు.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీజన్ 3లో పాల్గొన్నారు. రెండు ఎపిసోడ్స్ గా బాలయ్య, పవన్ కళ్యాణ్ టాక్ షో వచ్చింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎపిసోడ్ కి కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు. ‘గేమ్ చేంజర్’ సినిమాకి కూడా ఈ ఎపిసోడ్ ప్రమోషన్ అవుతుందని అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో కూడా బాలయ్య రామ్ చరణ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో షోకి రావాలని బాలయ్య ఇన్వైట్ చేశారు. ఆ కలయిక ఇప్పుడు జరగబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య, రామ్ చరణ్ మధ్యలో మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరి కలయికలో ఎపిసోడ్ వస్తే అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఒక విధంగా చాలా రోజులుగా ఫ్యాన్స్ దీని కోసమే ఎదురుచూస్తున్నారు.

దీనికి సంబంధించి ఆహా ఎప్పుడు ప్రకటన ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘గేమ్ చేంజర్’ తో రామ్ చరణ్, ‘డాకు మహారాజ్’ తో బాలయ్య, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి రేసులో పోటీ పడుతున్నారు. ఈ మూడు సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది.