రామ్ చరణ్ డిజైనర్ హుడీ ధర చుక్కల్లో
ఇప్పుడు అలాంటి ఒక సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ `అన్‌స్టాపబుల్` షో షూట్‌లో పాల్గొన్నారు చరణ్.
By: Tupaki Desk | 1 Jan 2025 4:16 AM GMTసెలబ్రిటీలు వేదికలపై కనిపించేప్పుడు షాస్టాపర్ గా మారడానికి లుక్ చాలా ఇంపార్టెంట్. ఎంపిక చేసుకునే టీషర్ట్, బాటమ్ లైన్, షూస్, వాచ్, యాక్ససరీస్ ఇలా ప్రతిదీ ఆడియెన్ పరిగణనలోకి తీసుకుంటారు. భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ల ఫ్యాషన్ సెన్స్ ను ప్రజలు నిరంతరం ప్రత్యేక దృష్టితో గమనిస్తుంటారు.
ఇప్పుడు అలాంటి ఒక సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ `అన్‌స్టాపబుల్` షో షూట్‌లో పాల్గొన్నారు చరణ్. ఈ వేదికపై సంక్రాంతికి రిలీజవుతున్న తన సినిమా `గేమ్ ఛేంజర్`ను ప్రమోట్ చేశాడు. `ఆహా` వేదికగా నందమూరి నటసింహంతో మెగా పవర్ స్టార్ షో అహూతులను ఆకట్టుకోనుందని తాజాగా రిలీజైన ఫోటోలు చెబుతున్నాయి.
అయితే అందరి దృష్టిని ఆకర్షించిన మరొక విషయం ఇక్కడ ఉంది. అది చరణ్ తొడుక్కున్న బ్లాక్ హుడీ. పొడవాటి జుట్టు.. గుబురు గడ్డం.. స్మైలీ ఫేస్ తో చరణ్ ఈ షోలో కనిపించాడు. ఆ రూపానికి తగినట్టుగానే బ్లాక్ హుడీ, బ్లాక్ ఫ్యాంట్ లో చరణ్ స్మార్ట్ గా కనిపించాడు. ముఖ్యంగా చరణ్ ధరించిన డిజైనర్ హుడీ అందరి దృష్టిని ఆకర్షించింది. హుడీ ఎంతో స్టైలిష్ గా లావిష్‌గా పర్సనాలిటీని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఈ హుడీలో చరణ్ డ్యాషింగ్ గా కనిపించాడంటూ అభిమానులు ఈ లుక్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. అయితే లుక్ కి తగ్గట్టే హుడీ ధర కూడా నోరెళ్లబెట్టే రేంజులోనే ఉంది. దీని ఆన్ లైన్ ధర సుమారు రూ.88,000 నుంచి 1,50,000 వేల రేంజులో కనిపిస్తోంది. ఇది బ్రాండెడ్ హుడీ. ఎఎంఐఆర్ఐ బోన్స్ కంపెనీకి చెందిన హుడీ. దీంతో ధర చుక్కల్ని తాకుతోంది.
`అన్ స్టాపబుల్` షోలో చరణ్ చాలా సందడి ఆకట్టుకోనుందని సమాచారం. బాలయ్య బాబుతో సరదా సంభాషణలు హైలైట్ కానున్నాయి. ముఖ్యంగా మెగా-నందమూరి కలయిక ఇరువర్గాల అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా కనిపిస్తారు. ఈ క్రేజీ ఎపిసోడ్ త్వరలో ఆహాలో ప్రదర్శితం కానుంది. సంక్రాంతి బరిలో చరణ్ `గేమ్ ఛేంజర్` తో పాటు నందమూరి బాలకృష్ణ `డాకు` కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.