Begin typing your search above and press return to search.

కలియుగ భీమగా రామ్ చరణ్‌...!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:30 PM GMT
కలియుగ భీమగా రామ్ చరణ్‌...!
X

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా విడుదలకు ముందే చరణ్ తన తదుపరి సినిమా ను కమిట్ అయ్యాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా సినిమా కన్ఫర్మ్‌ అయింది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచక జరుగుతోంది. ఇటీవలే పూజ కార్యక్రమాలూ పూర్తి అవ్వడంతో రెగ్యులర్‌ షూటింగ్ కి అంతా వెయిట్‌ చేస్తున్నారు.

చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ ప్రకటించినప్పటి నుంచీ ఒక స్పోర్ట్స్ డ్రామా గా రూపొందబోతుందని, చరణ్‌ ను స్పోర్ట్స్ పర్సన్‌ గా చూడబోతున్నామనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి అదే విషయమై ఇంకో గాసిప్ వినిపిస్తుంది . ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంకు చెందిన రామ్మూర్తి నాయుడు జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు తీసుకుని కల్పిత పాత్రలు, కల్పిత స్క్రీన్‌ ప్లేతో బుచ్చిబాబు స్క్రిప్ట్‌ ను రెడీ చేసుకున్నాడట. చిరంజీవి, చరణ్ తో పాటు మెగా కాంపౌండ్ కి ఈ స్క్రిప్ట్‌ బాగా నచ్చిందట. అందుకే గేమ్‌ ఛేంజర్ విడుదలకు ముందే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మల్ల యోధుడు, కలియుగ భీముడిగా పేరున్న రామ్మూర్తి నాయుడు కథను తీసుకుని, కమర్షియల్‌ హంగులు అద్ది పలు మార్పులు చేసి బుచ్చిబాబు సినిమాగా తీయబోతున్నాడు. కలియుగ భీమ పాత్ర కోసం చరణ్‌ గత మూడు వారాలుగా విదేశాల్లో కండలు పెంచే పనిలో ఉన్నాడు. కేవలం కండలు మాత్రమే పెంచడం కాకుండా ఫిజికల్‌ గా చాలా మార్పులు కనిపించే విధంగా వర్కౌట్స్ చేస్తున్నాడట. మల్ల యోధుడు అంటే ఎలా ఉండాలి అనే రిఫరెన్స్ లు తీసుకుని ప్రస్తుతం చరణ్‌ దానిపై వర్కౌట్లు చేస్తున్నాడు.

శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉన్న ప్రచారం అనుసారం.. 1882 లో వీరఘట్టం లో రామ్మూర్తి నాయుడు జన్మించాడు. చిన్నతనంలోనే కుస్తీ వైపు అడుగులు వేశాడు. ఆయన కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ తన కుస్తీ విన్యాసాలను చూపించాడు. అప్పట్లో బ్రిటీష్‌ పాలనలో ఉన్న ఇండియాకు చెందిన వాడు రామ్మూర్తి నాయుడు అవ్వడం వల్ల ఎక్కువ గుర్తింపు రాలేదు అనేది టాక్‌. సర్కస్ కంపెనీ ని నడిపించడం తో పాటు, ఎన్నో సాహసాలు జనాల మధ్య చేసి ఆశ్చర్యపోయేలా చేసిన వీరుడు రామ్మూర్తి నాయుడు. అలాంటి రామ్మూర్తి నాయుడు సినిమాను చరణ్ తో బుచ్చిబాబు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ ను చరణ్ కి జోడీగా బుచ్చి బాబు నటింపజేస్తున్నాడు. దసరాకి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.